పూర్వ కాలంలో వేసవి తాపాన్ని ఎలా తీర్చుకొనేవారో తెలుసా..?
పానకం..
పానకం కోసం ఒక గ్లాసు నీటిలో, మూడు టేబుల్ స్పూన్ల బెల్లం వేసి బాగా కరగనివ్వాలి. అందులో మూడో టేబుల్ స్పూన్ల నిమ్మరసం, చిటికలు యాలకుల పొడి, కలిపి తీసుకోవడం వల్ల, డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. బెల్లంలోని గ్లూకోజ్ కంటెంట్,వెంటనే రక్తంలో కలిసిపోయి, తక్షణ ఎనర్జీని ఇస్తుంది.
లస్సి..
లస్సి కోసం ఒక కప్పు పెరుగు, మూడు టేబుల్ స్పూన్ల చక్కెర, ఒక గ్లాస్ ఐస్ వాటర్ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చిన లస్సీని, సీజనల్ ఫ్రూట్స్ తో కలిపి తీసుకోవడంతో వారి తాపాన్ని తొందరగా తగ్గించుకునేవారు. కావున మనకు ఎప్పుడైనా డిహైడ్రేషన్ కలిగినప్పుడు ఇలా చేయడం ఉత్తమం.
జల్జీరా..
జల్జీరా కోసం గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి.అ తర్వాత అర స్ఫూన్ జీలకర్రను దొరగా వేయంచి,ఒక మిక్సీ గిన్నెలో పుదీనా, కొత్తిమీర,చింతపండు,అర అంగుళం అల్లం వేసి బాగా మీక్సీ పట్టుకోవాలి.ఈ మిశ్రమానికి ఇంగువ, ఉప్పు,పంచదార, నిమ్మరసం కలిపి, ఒక గ్లాస్ నీళ్లు పోసి మరోసారి మీక్సీ పట్టుకోవాలి. దీనితో జల్ జీరా రెడీ. అ తర్వాత అ మిశ్రమాన్ని వడబోసి, ఐస్ ముక్కలు వేసి,చల్లగా తీసుకోవడం వల్ల వేసవి తాపాన్ని తొందరగా తగ్గించుకోవచ్చు.