షుగర్ ఉన్నవారు మద్యం సేవించవచ్చా..!!
మామూలుగా మధుమేహ గ్రహస్తులు నాడులు దెబ్బతినే ముప్పు ఎక్కువగా ఉంటుందట. చాలా ఏళ్ల నుంచి షుగర్ తో బాధపడుతూ ఉంటే అంత ఎక్కువగా నాడులు దెబ్బ తినే ప్రమాదం ఉంటుందట. దీనివల్ల చాలామందికి కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం ,మంట పెట్టడం సూదులు పొడిచినట్లు అనిపించడం వంటివి జరుగుతూ ఉంటాయట. ఈ సమస్యలకు షుగర్ తోడైతే వ్యాధులు అన్నిటికి తీవ్రమయ్యేలా చేస్తుంది. అందుకే.. అందుచేతనే కాళ్లు పుండ్లు పట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మద్యం తాగాల్సి వస్తే ముందు భోజనం చేసి మాత్రలు వేసుకోవాలి..
మద్యం తాగిన తర్వాత భోజనం చేయకపోతే మందులు అసలు వేసుకోకూడదట.. కాలేయం నిరంతరం గ్లూకోజ్ ను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది.. రక్తంలో గ్లూకోజ్ కూడా స్థిరంగా ఉంటాయి ఈ ప్రక్రియలు మధ్యలోని ఆల్కహాల్ వాటిని దెబ్బతినేలా చేస్తుంది. దీనివల్ల శరీరానికి తగినంత గ్లూకోజ్ ఉత్పత్తి అవ్వకుండా ఉంటుందట. యాంటీ బయోటిక్స్ నొప్పిని తగ్గించే మందులు వంటివి జీర్ణాశయ పూత సమస్యకు దారి తీసేయాల ఉంటాయట. మద్యం కూడా ఈ సమస్యను తెచ్చిపెడుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. మందులు మద్యం రెండూ కలిపి తీసుకున్నట్లయితే సమస్య మరింత ఎక్కువ అవుతుందట. మరి కొంతమందికి వాంతులు చాతిలో నొప్పి మరి కొంతమందికి రక్తపు వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుందట. అందుచేతనే టాబ్లెట్లు వేసుకున్న తర్వాత ఆల్కహాల్ జోలికి ఆసలు వెళ్లకూడదట.