డ్యాన్స్ చేయండి.. బరువు తగ్గండి..!

Divya
ఈ మధ్యకాలంలో ఆహారపు అలవాట్లు,జీవన విధానం కారణంగా చాలామంది అధిక బరువు సమస్య ఎదుర్కొంటూ వున్నారు.ఈ అధికబరువు వల్ల గుండెపోటు,మధుమేహం వాతం నొప్పులు జీర్ణసమస్యలు మొదలైనవి జబ్బులు చుట్టుముడతాయి.కావున ఈ అధిక బరువు తగ్గించుకోవడానికి డైట్ లు అంటూ,వ్యాయామాలతో చాలా రకరకాలుగా ప్రయత్నిస్తూంటారు.అలాంటివారు డాన్స్ చేయడం వల్ల సులభంగా వారు బరువు తగ్గించుకోవచ్చు.ఈ డాన్స్ తో ఆనందానికి ఆనందం ఆరోగ్యానికి ఆరోగ్యం కలుగుతుంది.అలాంటి డాన్స్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
హిప్ హాప్..
ఈ డాన్స్ చేయడానికి చాలా ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఈ డాన్స్ చేయడం వల్ల చాలా మంది రోజుకు 300 నుంచి 400 వరకు క్యాలరీలు ఖర్చు చేసుకుంటూ ఉన్నారు.ఇలా రోజు చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు అని చెబుతున్నారు.
బెల్లి డ్యాన్స్..
ఈ డాన్స్ చేయడం వల్ల పొట్టపైగల కొవ్వును ఈజీగా కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.రోజూ ఈ డాన్స్ చేయడం వల్ల గంటకి 300 క్యాలరీలు ఖర్చు అవుతాయి.
బ్యాలెట్ డాన్స్..
బ్యాలెట్ డ్యాన్స్ చేయడం వల్ల కాళ్ళ కండరాలు దృఢంగా తయారవడానికి బాగా ఉపయోగపడతాయి.సిక్స్ ప్యాక్ తయారవడానికి బ్యాలెట్ డాన్స్ బాగా ఉపయోగపడుతుంది.
జూంబా డాన్స్..
బరువు తగ్గించాలని శరీరం ఫిట్ గా ఉండడానికి జుంబా డాన్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది.ఈ జుంబా డాన్స్ నిమిషం చేయడం వల్ల శరీరంలో పది క్యాలరీలు ఖర్చు అవుతాయి.అధికబరువు తగ్గించుకోవాలనుకునే వారికి డాన్స్ మంచి రెమెడీ అని చెప్పవచ్చు.
పోల్ డాన్స్..
ఇది మన శరీరంలో ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది.ఈ డాన్స్ చేయడం వల్ల అత్యధిక కేలరీలను ఖర్చు చేసుకోవచ్చు.ఇది శరీరంలోని అవనవసరంగా ఉన్న కొవ్వులను ఈజీగా కలిగిస్తుంది.
ప్రీస్టైల్ డాన్స్..
ఇదొక వెస్ట్రన్ డాన్స్.మనం బరువు తొందరగా,ఈజీగా కరిగించుకోవాలంటే ఈ డాన్స్ బాగా ఉపయోగపడుతుంది.ఈ డాన్స్ గంటసేపు ప్రాక్టీస్ చేయడం వల్ల 360 క్యాలరీలు ఖర్చు అవుతాయి. కావున ఈ డాన్స్ లు అన్నీ వేయడం అలవాటు చేసుకుని సంతోషంగా బరువు తగ్గండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: