మన శరీరాన్ని చల్లగా ఉంచే విత్తనాల్లో సోంపు గింజలు కూడా ఒకటి. వీటిలో ఉండే రసాయన సమ్మేళనాలు శరీరంలో వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరచడంలో బాగా సహాయపడతాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి.వీటిని వంటల్లో వాడడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు శరీరం కూడా కూల్ గా ఉంటుంది.శరీరానికి కావల్సిన పోషకాలు కూడా ఈజీగా అందుతాయి.అలాగే చియా విత్తనాలను తీసుకోవడం వల్ల కూడా మన శరీరం బాగా చల్లబడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరం నీటి స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. దీంతో శరీరం చాలా చల్లగా ఉంటుంది.ఇంకా అంతేకాకుండా వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే ఇన్ ప్లామేషన్ కూడా తగ్గుతుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎండ వల్ల శరీరం కోల్పోయిన పోషకాలు కూడా తిరిగి లభిస్తాయి. ఇంకా అదే విధంగా శరీరాన్ని చల్లబరచడంలో అవిసె గింజలు కూడా మనకు సహాయపడతాయి. వీటిలో ఉండే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఎండ వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించి శరీరం చల్లగా ఉండేలా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.
అవిసె గింజలను తీసుకోవడం వల్ల ఎండ వల్ల కలిగే నీరసం నుండి మనల్ని మనం ఈజీగా కాపాడుకోవచ్చు. అలాగే జీలకర్రను తీసుకోవడం వల్ల కూడా శరీరం చాలా చల్లగా ఉంటుంది.ఎందుకంటే దీనిలో ఉండే వివిధ రకాల నూనెలు శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి.ఇంకా అలాగే ఎండ వల్ల శరీరంలో జీర్ణశక్తి మందగిస్తుంది.కాబట్టి జీలకర్రను తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉండడంతో పాటు జీర్ణశక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుంది.ఇంకా అదే విధంగా వేసవికాలంలో గసగసాలను తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఆల్కలాయిడ్స్ శరీరంలో ఉండే ఉష్ణోగ్రతను ఇంకా ఇన్ ప్లామేషన్ ను తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి.ఇంకా అంతేకాకుండా గసగసాల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది. అలాగే ధనియాలను, మెంతులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కూడా శరీరం చాలా చల్లగా ఉంటుంది.