రాత్రిపూట స్నానం చేయడం మంచిదేనా..?
వేసవికాలంలో దుమ్ము సూర్యకాంతి కారణంగా చర్మం పొడిబారడం వంటివి జరుగుతూ ఉంటుంది.. దీనికి తేమ చాలా అవసరం ముఖ్యంగా పొలాలలో పనిచేసే వారు ఈ వేసవికాలం జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే వేసవికాలంలో రాత్రి సమయాలలో స్నానం చేస్తే మురికి మొత్తం పోతుందట. ప్రతిరోజు దుమ్ము చెమటల వల్ల శరీరం చాలా అశుభ్రంగా ఉంటుంది.. దీంతోపాటు శరీరంలో అలసట కూడా వస్తుందట. ఇలాంటి పరిస్థితులలో నిద్ర రావడం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది అటువంటి పరిస్థితులలో రాత్రి సమయాలలో తలస్నానం చేస్తే నిద్ర బాగా వస్తుందట.
రాత్రిపూట స్నానం చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని కొంతమంది పరిశోధకులు తెలియజేయడం జరిగింది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగిపోవడం వల్ల అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు మరొకవైపు వేసవిలో శరీరం చెమటలు పట్టడం వల్ల మురికి పెరిగిపోవడమే కాకుండా చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది తెలియజేస్తున్నారు. రాత్రిపూట స్నానం చేయడం వల్ల కలిగే హాని గురించి ఎలాంటి నిజం లేదట.. రాత్రి స్నానం చేసేటప్పుడు కొన్ని విషయాలను మాత్రమే గుర్తుంచుకోవాలి..రాత్రిపూట చాలా చల్లని నీటితో స్నానం అసలు చేయకూడదు స్నానం చేసి సమయంలో రాత్రి ఆలస్యంగా ఉండకూడదు. ఎందుకంటే రాత్రి ఆలస్యం గా స్నానం చేయడం వల్ల ఆలస్యంగా నిద్ర లభిస్తుంది.. ఆహారం తీసుకునే ముందు మాత్రమే కచ్చితంగా తల స్నానం చేయాలట. తల స్నానం చేసిన తర్వాత ఎక్కువసేపు తడవకుండా చూసుకోవాలి.