మన పూర్వీకులు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఇంకా అంతేకాకుండా చాలా యాక్టివ్ గా కూడా పనులు చేసేవారు. వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా వారి పనులను చాలా యాక్టీవ్ గా చేసుకునేవారు.అప్పటి వాళ్ళని ఇప్పుటి వాళ్ళతో పోల్చుకొని చూస్తే ఇప్పుడంతా చాలా విభిన్నంగా ఉంది.ప్రస్తుతం యువత చాలా వ్యాధుల బారిన పడుతున్నారు.అందుకు ప్రధాన కారణాలు ఆధునిక జీవనశైలిని అనుసరించడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలామందిలో కూడా అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల టాక్సిన్స్ పేరుకు పోతున్నాయి.మద్యపానం అలవాటు వల్ల ఇలాంటి సమస్యలు అధికమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఈ టాక్సిన్లు పేరుకుపోవడం వల్ల కిడ్నీలు ఇంకా లివర్ ఖచ్చితంగా దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు కూడా పాటించాలి.మన శరీరంలో లివర్ ఒక్కసారి దెబ్బ తింటే అది జీవితాంతం పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడినవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ఆయుర్వేద నిపుణులు సూచించిన నిమ్మకాయలో ఉండే గింజలను ప్రతిరోజు నమిలి తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో మనకు ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్ లభిస్తాయి. మద్యం సేవించడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు లివర్ పై పడకుండా ఇవి సంరక్షిస్తాయి.ఎక్కువగా మద్యం సేవించేవారు ఈ నిమ్మకాయ గింజలను ప్రతి రోజు తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ప్రస్తుతం చాలామంది కూడా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు నిమ్మకాయ రసం తో పాటు గింజలను కలుపుకొని తాగడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు.ఎందుకంటే ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీరంలో పేరుకుపోయిన అన్ని రకాల వ్యర్ధపదార్థాలను ఈజీగా బయటకు పంపించేందుకు సహాయపడతాయి.