వాముతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..?
వాముని 10 గ్రాములు గిన్నెలోకి తీసుకొని అందులో 60 ఎంల్ నీటిని తీసుకొని బాగా మరిగించి ప్రతి రెండు గంటలకు ఒకసారి 15 ఎంల్ చొప్పున తీసుకుంటే నీళ్ల విరోచనాలు తగ్గించుకోవచ్చు. వాముని దోరగా వేయించి దానికి కొంచెం ఉప్పుని చేర్చి బాగా నూరి ప్రతిరోజు చిన్న పిల్లలకు ఆహారంతో పాటు కొంచెం వాము విశ్వమాన్ని తినిపిస్తే పిల్లలకు అజీర్ణ తత్వం తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది.
చిన్నపిల్లలకు వచ్చే కడుపు ఉబ్బరం మరియు కడుపునొప్పులకు ఓ చెంచా వామును తీసుకొని చిటికెడు సొంటి పొడి చిటికెడు దుంపరాసి చూర్ణం ఇది అన్ని పచారీ షాపుల్లో దొరుకుతుంది. ఈ మూడింటిని నీళ్లలో పోసి మరిగించి ఇస్తే కడుపు ఉబ్బరం నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
వాము పొడిని రోజుకు రెండు గ్రాములు చొప్పున బెల్లంతో కలిపి నమిలి మింగాలి. ఇలా ఓ వారం రోజులు పాటు పత్యం చేస్తే ఎలర్జీలకు సంబంధించి వచ్చే దద్దుర్లను నివారించవచ్చు. చిగుళ్ల వాపు తగ్గడానికి కూడా వాము కలకండని నోటిలో ఉంచుకొని రసాన్ని కొద్దికొద్దిగా మింగితే చిగుళ్ల వాపును నివారించవచ్చు.
రోజుకు రెండు చెంచాల వాము పుడిని భోజనానికి ముందు వీటితో సేవిస్తే రక్తంలో పెరిగిన కొలెస్ట్రాల్ శాతం వారం రోజుల్లో తగ్గుతుంది. ప్రతిరోజు వాముపొడిని తింటూ ఉంటే అధిక కొవ్వు వల్ల వచ్చే గుండెనొప్పి మరియు పక్షం వాతం వంటి ప్రమాదకర వ్యాధులను నిరోధించుకోవచ్చు.
పిప్పళ్ళు,నూడి,సొంటి, మిరియాలు జీలకర్ర వాము ఈ ఆరు దినుసులు పచారీ షాపుల్లో లభిస్తాయి. వీటిని సమాన భాగాలుగా గ్రహించి పొడిచేసి పటిక బెల్లంపొడి లేదా తేనెలో సేవించాలి. ఇలా చేయడం వల్ల అధికంగా భోజనం చేయడం వల్ల వచ్చే అజీర్ణశక్తి కచ్చితంగా తగ్గుతుంది.