రుచికి తియ్యగా ఉండే చక్కెర ఆరోగ్యానికి మాత్రం విషంతో సమానం అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.మోతాదుకు మించిన చక్కెర వాడకంతో శరీరంలో హార్మోన్లు ఇంకా మెదడుపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. చక్కెరతో స్థూలకాయానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది శరీరం బరువు నియంత్రించే గుణాన్ని కోల్పోయేలా చేస్తుంది.చక్కెరతో చేసిన పదార్థాలను తింటున్నప్పుడు దానితో సంబంధం ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం మరచిపోతాము. దీనివల్ల ఊబకాయం, కొవ్వు ఇంకా మధుమేహం వంటి వ్యాధులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కానీ, పంచదారకు బదులుగా కొన్ని తీపిని ఇచ్చే ఆహార పదార్థాలను ఉపయోగించటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందంటున్నారు.ఖర్జూరం అనేది సహజ స్వీటెనర్లలో ఒకటి.ఇది ఫ్రక్టోజ్ మూలం.అంటే పండ్లలో ఉండే సహజ చక్కెరలు కూడా ఇందులో ఉంటాయి. ఖర్జూరంలో పీచు, పోషకాలు, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయి.అలాగే తేనెలో క్యాలరీలు సమృద్ధిగా ఉంటాయి.
కాల్షియం, పొటాషియం,
విటమిన్ సి, బి1, బి2, బి3, బి5, బి6 వంటి ముఖ్యమైన ఖనిజాలు ఇంకా విటమిన్లు ఉంటాయి.అలాగే ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చాలా ఉన్నాయి. తేనె రుచికి చాలా తీపిగా ఉంటుంది.అందువల్ల చక్కెరతో పోలిస్తే దీనిని తక్కువగా ఉపయోగించవచ్చు.అలాగే బెల్లం పంచదార కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇందులో మొలాసిస్ అనేది ఉంటుంది. మొలాసిస్ ఒక పోషక ఉప ఉత్పత్తి.ఇక శుద్ధి చేసిన చక్కెరను తయారుచేసేటప్పుడు ఇది తరచుగా తొలగించబడుతుంది. కానీ బెల్లం దానిని ఈజీగా కవర్ చేస్తుంది.ఇంకా అలాగే బ్రౌన్
షుగర్ కూడా చక్కెర కంటే చాలా బెటర్. ఇది శరీరానికి చాలా ముఖ్యమైన కాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం, ఫాస్పరస్,
కాపర్ ఇంకా
విటమిన్ బి-6 వంటి వివిధ సూక్ష్మపోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే మొలాసిస్ జీవక్రియను పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది.