ఇప్పుడు చెప్పబోయే టీని తాగడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మనకు సులభంగా లభించే
మసాలా దినుసులతో ఓ పౌడర్ ను తయారు చేసుకుని ఆ పౌడర్ తో మనకు కావల్సినప్పుడు టీ ని తయారు చేసుకుని తాగవచ్చు.ఇక ఈ
మసాలా టీ తయారీకి కావల్సిన
మసాలా పౌడర్ ను అలాగే దీనితో టీ ని ఎలా తయారు చేసుకోవాలి? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ
మసాలా టీ పౌడర్ తయారీకి కావల్సిన పదార్థాలు..దంచిన అతి మధురం వేర్లు – 2,
తులసి ఆకులు – 10,
దాల్చిన చెక్క ముక్కలు -4, యాలకులు – 20, లవంగాలు – 30, నల్ల యాలకులు – 4, దంచిన జాజికాయ – 1, మిరియాలు- 3 టీ స్పూన్స్, శొంఠి ముక్కలు – 10 ఇంకా అలాగే ఎండిన
తులసి పువ్వులు- గుప్పెడు తీసుకోవాలి.ఇంకా ఈ టీ తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..నీళ్లు – ఒక గ్లాస్, పటిక బెల్లం – 2 టీ స్పూన్స్ లేదా తగినంత, టీ పౌడర్ – ఒక టీ స్పూన్ ఇంకా
మసాలా టీ పౌడర్ -ఒక టీ స్పూన్ ఇంకా పాలు – రెండు కప్పులు తీసుకోవాలి.
మసాలా టీ పౌడర్ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా కళాయిలో
మసాలా పౌడర్ కు కావల్సిన పదార్థాలు వేసి వాటిని దోరగా వేయించాలి.ఆ తరువాత
స్టవ్ ని ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ దినుసులను జార్ లో వేసి వాటిని మెత్తగా
మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఈ పౌడర్ చల్లారిన తరువాత గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ తో టీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
దీని కోసం ఒక గిన్నెలో నీళ్లు, పటిక బెల్లం ఇంకా టీ పౌడర్ వేసి వేడి చేయాలి. ఆ తరువాత ముందుగా తయారు చేసుకున్న
మసాలా పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి.ఆ తరువాత పాలు పోసి కలపాలి. అలాగే ఈ టీ ని మరో 3 నిమిషాల పాటు మరిగించి
స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ టీని వడకట్టి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఉండే
మసాలా టీ తయారవుతుంది. ఈ టీని తాగడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.ఇంకా అలాగే సీజనల్ గా వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు.