58 ఏళ్ళ వయస్సులో.. కవలలకు జన్మనిచ్చింది?

praveen
పెళ్లి అనే బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ప్రతి అమ్మాయి కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చి అమ్మ అని పిలిపించుకోవాలని ఎంతగానో ఆశపడుతుంటుంది. ఇక మాతృత్వపు అనుభూతిని పొందాలని ప్రతి మహిళా కూడా కోరుకుంటూఉంటుంది. అయితే కొంతమందికి పెళ్లయిన ఏడాదికే ఇలా మాతృత్వపు అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది విషయంలో దేవుడు పగబట్టినట్లుగానే వ్యవహరిస్తాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా.. ఇక పిల్లలు కాక ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు.


 ఒకవైపు తమకు పిల్లలు కావడం లేదు అన్న బాధ.. మరోవైపు సభ్య సమాజం నుంచి ఎదురయ్యే అవమానాలు తట్టుకుంటూ అసంతృప్తికర జీవితాన్ని గడుపుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవలే కాలంలో మాత్రం వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఆధారంగా పెళ్లయి ఏళ్లు గడుస్తున్న పిల్లలు లేక బాధపడుతున్న వారు ఇక ఇప్పుడు సరికొత్త పద్ధతిలో పిల్లలకు జన్మనిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఐవిఎఫ్ పద్ధతి ద్వారా ఇక ఎంతోమంది పిల్లలను కంటున్నారు అని చెప్పాలి. అయితే కాస్త లేటు వయసులో కూడా కొంతమంది మహిళలు పిల్లలకు జన్మనిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.


 ఇటీవల రాజస్థాన్ బికనీర్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. షరా బహదూర్ అనే మహిళ 58 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చింది. తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. అయితే ఆమెకు పెళ్లయి 30 ఏళ్లు దాటిన ఇప్పటివరకు పిల్లలు పుట్టలేదు. ఎంతమంది డాక్టర్లు చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకుండా పోయింది. పూజలు చేసిన ఫలితం దక్కలేదు. అయితే ఇటీవలే ఆమె ఐవిఎఫ్ విధానంలో పిల్లలను కనాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించగా.. వైద్యులు ఆమె హార్మోన్లు సరి చేయడానికి ఏడాది పాటు చికిత్స చేసి ఐవీఎఫ్ ప్రక్రియను ప్రారంభించారు. ఇక ఇటీవల విజయవంతంగా ఆమె కాన్పులో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: