ఖర్జూరాలతో శరీరానికి లాభాలే లాభాలు...!!
ఖర్జూరాల వల్ల శరీరానికి కలిగే లాభాలు :
ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే చాలామంది ఆయుర్వేద నిపుణులు దీనిని మూలికగా భావిస్తారు. ఇందు లో కాల్షియం, పొటాషియం,ప్రోటీన్లు, మాంగనీస్,మెగ్నీషియం, ఫాస్పరస్ తోపాటు జింక్, విటమిన్-బి6,ఎ పుష్కలంగా లభిస్తుంది. అంతే కాకుండా ఖర్జూర పండుల కార్బోహైడ్రేట్లు ఫైబర్ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి అందుచేతనే ఇవి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి.. ఇవి ఆరోగ్యాన్ని అన్ని రకాల వ్యాధుల నుంచి కూడా రక్షిస్తాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం శరీర బరువును సులభంగా నియంత్రించుకోవచ్చు. అని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు మూడు నుంచి నాలుగు ఖర్జూరాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల సులభంగా ఉభకాయం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఆకలి నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది.ఎండు ఖర్జూరం కూడా తినడానికి రుచిగా ఉంటుంది ఇందులో కూడా పలు రకాల ఉపయోగాలు పోషకాలు కూడా ఉన్నాయి.. పిల్లలకు కూడా వారంలో ఒకసారైనా ఇలాంటి ఖర్జూరాలను తినిపించడం చాలా మంచిది.షుగర్ పేషెంట్లు ఖర్జూర పండును తినకపోవడం మంచిది ఇందులో షుగర్ లెవెల్స్ అధికంగా ఉండడం వల్ల మరింత ఎక్కువ అవుతుందని కొంతమంది నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు.
ఖర్జూరం ప్రయోజనాలు :
*రక్తపోటును నియంత్రిస్తుంది.
*మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం
కలిగిస్తుంది.
*గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఎముకలను దృఢంగా చేస్తుంది.