కొర్రలు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
అంతేకాకుండా కొర్రల్లో అధికంగా పీచు పదార్థం, మాంసం,కృతులు,క్యాల్షియం,ఐరన్,మాంగనీస్, ఫాస్పరస్ వంటి అనేక ఖనిజాలు ఉంటాయి. చిన్నపిల్లలకు గర్భిణీలకు మంచి ఆహారంగా దీనిని పెట్టవచ్చు. ఉదర సంబంధ వ్యాధులకు కొర్రలు తినడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. కడుపునొప్పి మూత్రంలో మంట ఆకలి లేకపోవడం. వంటి సమస్యలకు కొర్రలతో చెక్ పెట్టవచ్చు. వీటిలో చాలా ఫైబర్ ఉంటుంది. ఇది డైజేషన్ కి చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ బియ్యం తినే బదులు కొర్రలు తినగా మంచి ఎనర్జీని పొందగలము.
100 గ్రాముల కొర్రలు తినగా 10 నుంచి 11 గ్రాముల వరకు ప్రోటీన్ ని పొందగలం. బ్రెయిన్ హెల్త్ కి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇందులో బి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ కెపాసిటీని కూడా పెంచుతుంది. ఆహారంలో కొర్రలని చేర్చుకోవడం వల్ల నాడీ బలహీనతను అధిగమించవచ్చు. నాడీ వ్యవస్థ పై సానుకూల ప్రభావాన్ని చూపే విటమిన్ వీటిలో లభిస్తుంది. ఇటువంటి కండిషన్ లేకుండా పెద్దవాళ్లు మరియు చిన్నవాళ్ళు ఎవరైనా వీటిని తినవచ్చు. మెదడు అభివృద్ధికి ఐరన్ సహాయపడుతుంది.ఇది మెదడుకు ఆక్సిజన్ సరిపడా చేస్తుంది. కొర్రలను తినడం వలన ఆక్సిజన్ మరింత ఎక్కువగా అందుతుంది. అంతేకాకుండా ఇనుము నేరుగా మెదడు పరిమితిలోకి సంబంధం కలిగి ఉంటుంది. కావున మెదడుకు తగినంత రక్తం లభిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరు కూడా సజావుగా సాగుతుంది. కొర్రలను రోజు తినడం వల్ల ఎటువంటి క్యాన్సర్లు రాకుండా కాపాడుకోవచ్చు.