రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని ఆహారాలు తినాలి. గ్రీన్ టీలో కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే పొద్దున్నే కాఫీ, టీ కి బదులుగా గ్రీన్ టీ తీసుకుంటే మేలు చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది చాలా మంచి ఎంపిక.ఇంకా అలాగే పెరుగు అనేది ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఇది రక్తంలో చక్కెర స్థాయిలని స్థిరీకరించి మంచి శక్తిని అందిస్తుంది. శక్తి ఉత్పత్తిని అవసరమైన విటమిన్లు ఇందులో ఉన్నాయి. ఇంకా అలాగే ఎముకల్ని దృఢంగా చేసే కాల్షియం పుష్కలంగా ఉంటుంది.అలాగే ఓట్స్ ఒక సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్. ఇది రోజంతా కూడా శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీవక్రియకి బాగా సహాయపడుతుంది. ఇది విటమిన్ బి కలిగి ఉంటుంది. ఓట్ మీల్ లేదా ఓట్స్ ఏ విధంగా చేసుకుని తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.అలాగే మధుమేహులకు కూడా ఇది చక్కని బ్రేక్ ఫాస్ట్.అలాగే బచ్చలికూర, కాలే వంటి ఆకుకూరలు తీసుకుంటే మంచి శక్తి లభిస్తుంది. ఎందుకంటే ఇందులో ఇనుముతో పాటి మెగ్నీషియం సహా శరీరానికి అవసరమైన పోషకాలని అందిస్తుంది.అలాగే ఇవి ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడే విటమిన్ బిని అందిస్తాయి.
అలాగే వాల్ నట్స్, చియా గింజలు, అవిసె గింజలు వంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఇంకా ఫైబర్ చాలా సమృద్ధిగా లభిస్తాయి. ఇవి స్థిరమైన శక్తిని కూడా అందిస్తాయి.అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరీకరించడంలో సహాయపడతాయి. చిరుతిండికి బదులుగా వీటిని చిన్న బాక్స్ లో పెట్టుకుని తింటూ ఉంటే ఖచ్చితంగా జంక్ ఫుడ్ తినాలనిపిదు. చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే చియా గింజలు నానబెట్టుకుని పొద్దున్నే తీసుకుంటే అనేక రోగాల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.ఇంకా ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు కలిగిన అద్భుతమైన పండు అరటి పండు.ఎందుకంటే ఇందులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే కండరాల పనితీరు మెరుగ్గా నిర్వహించేందుకు దోహదపడుతుంది. అయితే పరగడుపున అరటిపండు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే అరటి పండుతో కలిపి వేరే పండ్లు లేదా గింజలు తీసుకోవడం చాలా మంచిది.