నానబెట్టిన శనగలు ఆరోగ్యానికి ఎంత మేలంటే?

Purushottham Vinay
ఇక మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో నల్ల శనగలు కూడా ఒకటి. ఇవి మనందరికి కూడా తెలిసినవే. అలాగే నల్ల శనగలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము.మనం వీటితో కూరలు, గుగ్గిళ్లు వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాము. ఇంకా అలాగే కొందరు ఈ శనగలను మొలకెత్తించి కూడా తీసుకుంటూ ఉంటారు. నల్ల శనగలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు కలుగుతుంది. ఎందుకంటే వీటిలో మన శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఉన్నాయి. అందుకే వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ నల్ల శనగల వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ శనగలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి.కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి.ఇంకా అలాగే నల్ల శనగల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.



పిల్లలకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు వీటిని ఇవ్వడం వల్ల చాలా మేలు కలుగుతుంది. పిల్లలకు శనగలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల కూడా చక్కగా ఉంటుంది. ఈ శనగలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది.అలాగే మీ శరీరం ధృడంగా, బలంగా తయారవుతుంది. ఇంకా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శనగలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పని చేస్తుంది.ఇందులో అధికంగా ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.ఇంకా వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే జుట్టు ఒత్తుగా, ధృడంగా పెరుగుతుంది. ఇంకా బరువు తగ్గడంలో కూడా ఈ శనగలు మనకు బాగా సహాయపడతాయి.ఇక ఈ శనగలను రోజూ ముప్పావు కప్పు మోతాదులో తీసుకోవాలి. వీటిని రాత్రంతా కూడా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఉడికించి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: