షుగర్ ని అదుపులో ఉంచే ఆయుర్వేద మార్గాలు?

Purushottham Vinay
షుగర్ వ్యాధి అనేది జీవక్రియ వ్యాధి. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. మధుమేహానికి  కారణం మన సరైన ఆహారం ఇంకా జీవనశైలి. అయితే ఈ మధుమేహ వ్యాధిని పూర్తిగా నిర్మూలించలేము కానీ అదుపులో ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది.ఇండియాలో గత 4 సంవత్సరాలలో మధుమేహం ఏకంగా 44 శాతం పెరిగింది. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు ఇంకా ఆయుర్వేద మూలికలు మధుమేహాన్ని నివారించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచే టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.మధుమేహ రోగులకు కూడా గిలోయ్ అనేది ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరంలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఈ గిలోయ్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు  ఉన్నాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు ఆహారంలో గిలోయ్ వాటర్ చేర్చుకుంటే చాలా మంచిది.అలాగే ఉసిరి కూడా ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనది.


ఇది శరీరంలోని బ్లడ్‌ షుగర్‌ నియంత్రణకు  చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇవి ప్యాంక్రియాటిక్ పనితీరును మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి.ఉసిరి ఆక్సీకరణ ఒత్తిడి ఇంకా వాపును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఈ రెండూ కూడా మధుమేహానికి సంబంధించినవి.మన ఆయుర్వేదంలో చాలా కాలంగా షుగర్ వ్యాధికి కాకరకాయను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇందులో పాలీపెప్టైడ్-పి అనే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం ఉంటుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే చేదు గ్లూకోజ్ వినియోగాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఇది డయాబెటిక్ రోగులకు చాలా మేలు చేస్తుంది.అలాగే జామున్ అనేది హైపో-గ్లైసెమిక్ ప్రభావం కలిగి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్ ఇంకా పాలీఫెనాల్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెరను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: