ప్రశాంతమైన నిద్ర కోసం కొన్ని చిట్కాలు..!!
1). రాత్రిల్లో గాఢంగా నిద్రపోవాలి...అంటే పాలు తాగాల్సిందే... గోరువెచ్చని పాలు త్రాగడం వలన త్వరగా నిద్రపోతారు. ఎందుకంటే పాలలో ట్రిప్టివ్ ఉంటుంది. కావున అది నిద్రకు సహాయపడుతుంది. దాంతో కళ్ళకు పూర్తి విశ్రాంతి దొరుకుతుంది. పాలలో ఉండే క్యాల్షియం, పనిచేస్తుంది. మరియు బ్రెయిన్ లోని నరాలను ఫ్రీ చేస్తుంది.
2). నిద్ర పట్టాలంటే అరటిపండు తప్పనిసరి.విటమిన్ బి మరియు మజిల్ రిజాక్షన్స్ మెగ్నీషియం, పొటాషియం అందుకు సహాయపడతాయి.అరటిపండ్లలో ఉన్న పొటాషియం,మెగ్నీషియన్లు, ఓవర్ స్ట్రెస్, కు గురైన కండరాలను రిలాక్స్ చేస్తుంది. అరటిపండ్లలో ఉండే ట్రిప్టో ఫోన్ ఫీల్ గుడ్ మరియు మెల్లటోనియన్స్ గా మారి బ్రెయిన్ హార్మోన్స్ని విశ్రాంతి పరుస్తుంది. కావున ఈ పండు నిద్ర పట్టడానికి బాగా సహాయపడుతుంది.
3). వాల్ నట్స్ లో మెల్టోనియం అధికంగా ఉంటాయి. ఇవి నిద్ర క్వాలిటీని పెంచుతాయి. రాత్రి నిద్రించడానికి ముందు ఈ సూపర్ స్నాక్స్ తినడం వలన మంచిగా నిద్ర పడుతుంది. బ్లడ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇంకా బాదం లో ట్రిప్లో ఫోన్ మరియు మెగ్నీషియంలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మజిల్స్ ని రిలాక్స్ చేస్తాయి. తద్వారా నిద్ర బాగా పడుతుంది.
4). గుమ్మడి విత్తనాలు వీటిలో అమినో ఆసిడ్ ట్రిప్నో ఫోన్స్ ఇవి అధికంగా ఉంటాయి. కావున ఇవి నిద్ర పట్టడానికి ఎంతగానో సహాయపడతాయి. గుమ్మడి విత్తనాలను రాత్రి నిద్రించడానికి ముందు తినడం వల్ల సరైన లెవెల్స్ పెరిగి నిద్ర బాగా వస్తుంది.
5).సార్మన్ మరియు తునా (చేపలలో )విటమిన్ b6 అధికంగా ఉంటుంది. ఇవి నిద్రకు కారణమయ్యే హార్మోన్స్ ని ప్రోత్సహిస్తాయి. వీటిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉండడం వల్ల నిద్ర పట్టడానికి సహాయపడుతుంది.
6). కివి పండ్లు తినడం వల్ల నిద్ర క్వాలిటీ పెరుగుతుంది. కివి పండ్లలో స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఇవి సిరోటిన్ లెవల్స్ ను పెంచుతుంది. సరైన నిద్రను పెంచి దాని సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. గాడమైన నిద్రను తెప్పించడంలో ఇవి బాగా పనిచేస్తాయి.