పెరుగు ఎక్కువగా తినేవారికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి?

Purushottham Vinay
మనలో చాలా మంది కూడా పెరుగును ఎంతో ఇష్టంగా తింటారు. కొంతమందికి అయితే పెరుగుతో భోజనం చేయనిదే  భోజనం చేసిన అనుభూతి కలగదు.పెరుగును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఈ పెరుగును తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలతో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మనం పెరుగును ఎక్కువగా మధ్యాహ్నం అలాగే రాత్రి భోజన సమయంలో తీసుకుంటూ ఉంటాము. అయితే రాత్రి భోజనంలో పెరుగును ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే ఎవరికైతే ఉదయం లేచిన తరువాత గొంతులో కఫాలు, శ్లేష్మాలు పేరుకుపోయి ఉంటాయో వారు రాత్రి పూట పెరుగును ఎక్కువగా తీసుకోకూడదు.ఇంకా అలాగే కొందరికి తెల్లవారే సమయంలో పిల్లి కూతలు వస్తూ ఉంటాయి. ఇంకా తెల్లవారే సమయంలో దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటుంది.అలాగే ఆస్థమా, ఉదయం పూట తుమ్ములు ఎక్కువగా వచ్చే వారు ఇంకా బ్రాంకైటిస్ కలిగి ఉన్న వారు, శ్లేష్మత్వతం ఉన్న వారు రాత్రిపూట పెరుగును తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



పెరుగు కఫాన్ని అలాగే శ్లేష్మాన్ని ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అందువల్ల దగ్గు, ఆస్థమా వంటి సమస్యలు చాలా ఎక్కువవుతాయి. కాబట్టి ఇలాంటి వారు రాత్రి పూట పెరుగును తీసుకోకపోవడమే ఆరోగ్యానికి మంచిది. ఇంకా అదే విధంగా కొందరిలో ఉదయం లేచిన తరువాత కండరాలు పట్టేసినట్టు కూడా ఉంటుంది. తరువాత శరీరమంతా వాతం చేసినట్టు, నొప్పులుగా ఉంటుంది. ఇలాంటి వారు కూడా రాత్రిపూట పెరుగును తీసుకోకపోవడమే వారి ఆరోగ్యానికి మంచిది. పెరుగు శరీరంలో ఇన్ ప్లామేషన్ ను పెంచి నొప్పులు ఎక్కువయ్యేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి వారు రాత్రి పూట పెరుగుకు బదులుగా మజ్జిగను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు లేనివారు ఎలాంటి సందేహం లేకుండా రాత్రి పూట పెరుగును తీసుకోవచ్చని దీని వల్ల ఎటువంటి హాని కలగదు నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: