డిన్నర్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు?
ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న వివరాల ప్రకారం పడుకోవడానికి కనీసం ఒకటిన్నర నుంచి రెండు గంటల ముందే భోజనం తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి అనేది ఉండదు. మనం నిద్రలో ఉన్నప్పుడు శరీర జీర్ణవ్యవస్థ పనితీరు బాగా నెమ్మదిస్తుంది.ఈ క్రమంలో మీరు నిద్రించే సమయానికి కొన్ని నిముషాల ముందు లేదా గంట లోపు తిన్నారంటే ఆ తిన్న ఆహారం మాత్రం సరిగ్గా జీర్ణం కాదు. అలా జీర్ణం కాని ఆహారంలో శరీరంలో కొవ్వు రూపంలో మిగిలిపోయి మీరు అధిక బరువు పెరిగేలా చేస్తుంది.ఇక రాత్రి భోజనంలో వీలైనంత తేలికపాటి ఆహారాన్నే తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ తేలికపాటి ఆహారం త్వరగా జీర్ణమై శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది. అయితే అలా కాకుండా హెవీ ఫుడ్ ని కనుక తీసుకుంటే అది సరిగ్గా జీర్ణం కాక మీరు ఖచ్చితంగా బరువు పెరిగేందుకు దారితీస్తుంది.
ఇక రాత్రి సమయంలో తీసుకునే భోజనంలో సరిపడినంతా పోషకాలు ఉండేలా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి.ఎందుకంటే సంపూర్ణమైన ఆరోగ్యం కోసం ఖచ్చితంగా పోషకాహారం చాలా ముఖ్యం.అలాగే చాలా మంది కూడా రాత్రి పూట భోజనం తర్వాత తీపిని ఎక్కువగా తింటారు. ఈ తీయని పదార్థాల్లో కేలరీలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు ఖచ్చితంగా బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది.ఇంకా అలాగే మీరు తినే ఆహారంలో ఉప్పు ఖచ్చితంగా పరిమితంగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఉప్పు తక్కువైనా, ఎక్కువైనా మీ బీపీ లెవెల్స్‌లో మార్పులనేవి వచ్చి, అవి ఖచ్చితంగా గుండెపోటుకు దారితీస్తుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. ఎలాంటి రోగాలు రాకుండా ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్య బారిన పడకుండా ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పైన తెలిపిన జాగ్రత్తలు పాటించండి. అనారోగ్యం పాలు కాకండి.