దొండపండు వంటి పెదవుల కోసం ఇలా చేసి చూడండి..!
అలోవెరా..
అలోవెరాను ఇంట్లో ఈజీగా ప్రతి ఒక్కరూ పెంచుకోవచ్చు.దీనితో పెదాలపై పేరుకుపోయిన మృతకణాలు తొందరగా తొలగిపోతాయి.ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పెదాలను ఎర్రగా మార్చడానికి సహాయపడతాయి కుడా.దానికోసం అలోవెరా జెల్‌ని తీసుకుని పెదాలపై బాగా మసాజ్ చేయాలి.అరగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కుంటే సరి.
బీట్రూట్..
పెదాలపై ఉన్న మృతకణాలు,నల్ల మచ్చలను తొలగించడంలో బీట్రూట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.దీన్ని రాయడం వల్ల,నల్లని పెదవులు నెల రోజుల్లోగా గులాబీ పువ్వుల్లా మృదువుగా తయారవుతాయి.దాని కోసం బీట్రూట్ను తొక్క తీసి తురుమి, అందులో అర స్పున్ చక్కెర వేసి బాగా కలిపి,తర్వాత మీ పెదాలపై అప్లై చేసుకోవాలి.అలానే 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత పెదాలను నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.
దోసకాయ..
పెదవులపై నల్లటి వలయాలు లేదా నల్ల మచ్చలు బాధపడేవారు ఈజీగా దొరికే దోసకాయను ఉపయోగించవచ్చు.దోసకాయ నిజానికి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఈ చిట్కా కోసం తాజా దోసకాయ ముక్కలను తీసుకొని,పెదవులపై అరగంట పాటు మసాజ్ చేస్తూ ఉండాలి.ఇలా చేయడంతో పెదవులు కొన్ని రోజుల్లో సహజంగా ఎర్రపు రంగును సంతరించుకుంటాయి.ఇందులోని యాంటీఆక్సిడెంట్లు , సిలికా-రిచ్ కాంపౌండ్స్ పెదవులపై వున్న మృతకణాలు, నల్ల మచ్చలను తొందరగా తొలగిస్తుంది.మరి మీ పెదవులను ఈ చిట్కాలతో అందంగా మార్చుకోండి.