ఇప్పుడు చెప్పే లడ్డూను రోజుకు ఒకటి తింటే మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ లడ్డూలను పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎవరైనా కూడా తినవచ్చు.ఈ లడ్డూలను తినడం వల్ల ఎముకలు, దంతాలు చాలా ధృడంగా తయారవుతాయి.అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇంకా క్యాల్షియం లోపంతో బాధపడే వారు ఈ లడ్డూలను తినడం వల్ల క్యాల్షియం లోపం తగ్గడంతో పాటు మళ్ళీ రాకుండా ఉంటుంది. అలాగే ఈ లడ్డూలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి.ఇంకా రక్తహీనత సమస్య తలెత్తకుండా ఉంటుంది. అలాగే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము.పిల్లలకు ఈ లడ్డూలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల కూడా చాలా చక్కగా ఉంటుంది.ఇంకా అంతేకాకుండా అ లడ్డూలను తినడం వల్ల రక్తపోటు కూడా ఈజీగా అదుపులో ఉంటుంది.అలాగే శరీరంలో ఇన్ ప్లామేషన్ కూడా తగ్గుతుంది. స్త్రీలు ఈ లడ్డూలను తినడం వల్ల వారికి నెలసరి సక్రమంగా వస్తుంది. ఇంకా అంతేకాకుండా చర్మం ఇంకా జుట్టు ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. ఇక మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఈ లడ్డూలను తయారు చేయడం కూడా చాలా సులభం. కేవలం రెండంటే రెండు పదార్థాలతో మనం ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు. ఇక క్యాల్షియం లోపాన్ని నివారించే ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన ఆ రెండు పదార్థాలు ఏమిటి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ లడ్డూలను తయారు చేసుకోవడానికి మనం నువ్వులను ఇంకా ఖర్జూరాలను ఉపయోగించాల్సి ఉంటుంది.ఈ రెండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటితో లడ్డూలను తయారు చేసి తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ లడ్డూలను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కళాయిలో ఒక కప్పు నువ్వులను వేసి వాటిని దోరగా వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత ఒకటిన్నర కప్పు ఖర్జూర పండ్లను తీసుకుని వాటిలో ఉండే గింజలను తీసేసి వాటిని ముక్కలుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి. ఈ ఖర్జూర పండ్ల మిశ్రమాన్ని నువ్వులల్లో వేసి అంతా బాగా కలిసేలా కలుపుకుని లడ్డూలుగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లడ్డూలను ఫ్రిజ్ లో ఉంచి ఒక 15 రోజుల పాటు తినవచ్చు. ఈ విధంగా నువ్వుల లడ్డూలను తయారు చేసి తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత క్యాల్షియం లభించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.