లివర్, బ్లడ్ ని క్లీన్ చేసే జ్యూస్ ఇదే?

Purushottham Vinay
మనకు లభించే కొన్ని కూరగాయలతో తయారు చేసే జ్యూస్ లను తాగడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందడంతో పాటు బరువు కూడా ఈజీగా తగ్గొచ్చు. వెజిటబుల్ జ్యూస్ ల ఉపయోగ గురించి ఇప్పటి దాకా మనం చాలానే తెలుసుకున్నాం.ఇక ఇప్పుడు మరో వెజిటబుల్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి ఇంకా దానిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.బీట్ రూట్ ను ఉపయోగించి చేసే ఈ జ్యూస్ ను తాగడం వల్ల కాలేయంలో పేరుకున్న మలినాలు ఈజీగా తొలగిపోయి.. కాలేయం బాగా శుభ్రమవుతుంది. అలాగే రక్తనాళాల్లో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోయి.. రక్తం బాగా శుభ్ర పడుతుంది. ఇంకా అలాగే కంటి చూపు మెరుగుపడుతుంది. హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఈజీగా అదుపులో ఉంటాయి.అలాగే మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ కూడా అందుతాయి. ఇంకా బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది. శరీరంలోని మలినాలు, విష పదార్థాలు ఈజీగా తొలగిపోయి.. శరీరం బాగా శుభ్రపడుతుంది.



ఇక ఈ జ్యూస్ ను తయారు చేసుకునేందురు బీట్ రూట్, క్యారెట్, గుప్పెడు కొత్తిమీర, 2 ఇంచుల అల్లం ఇంకా ఒక టమాట తీసుకోవాలి. బీట్ రూట్ పై చెక్కు తీసి దానిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా అలాగే క్యారెట్, టమాటా, అల్లంను ముక్కలుగా తరిగి.. మిక్సీ జార్ లో వేసి అర టీ గ్లాస్ నీళ్లుపోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి మరో అర టీ గ్లాస్ నీళ్లుపోసి మిక్సీ పట్టుకోవాలి. ఇక ఆ తరువాత ఈ మిశ్రమాన్ని గ్లాస్ లోకి వడకట్టి జ్యూస్ ను తాగాలి.జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కూడా కలుపుకుని తాగవచ్చు. ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే కాలేయం శుభ్రం అవ్వడంతో పాటు బరువు కూడా ఈజీగా తగ్గవచ్చు. చర్మం కూడా కాంతివంతంగా ఇంకా అందంగా తయారవుతుంది.అలాగే శరీరంలో ఫ్రీ రాడికల్స్ పోయి క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యల బారిన పడకుండా కూడా ఉంటాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: