నిలబడి తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
సమయానికి తినకపోగా.. పైగా శరీరంపై శ్రద్ధ కూడా తగ్గుతోంది. అందుకే టైం కి తినకపోవడం వల్లే పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. చిన్నవయసులోనే ఊబకాయంతో పాటు అజీర్తి సమస్యలు, మరెన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరొకవైపు బిజీ లైఫ్ స్టైల్ లో రోడ్డు పక్కన ఏది పడితే అది దొరికితే తినడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఫహోటల్ లేదా కార్యాలయాల్లో ఆహారం తినే వారిని మనం రోజు చూస్తూనే ఉంటాము.
కొంతమంది అలవాటు ప్రకారం నిలబడి తింటే మరికొంతమంది తప్పని పరిస్థితుల్లో నిలబడి తినాల్సి వస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లలో కూడా ఇప్పుడు ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. ఒకసారి అయితే పర్వాలేదు కానీ అదే పనిగా ప్రతిరోజు అలాగే తింటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇలా నిలబడి తినడం వల్ల పేగులు కుషించుకుపోతాయి ఫలితంగా ఆహారం జీర్ణం కాక జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అలాగే కాళ్లు తుందిపై చెడు ప్రభావం చూపిస్తుంది. నిలబడి తినడం వల్ల అన్నవాహికపై దుష్ప్రభావం పడుతుంది. ఫలితంగా అల్సర్ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు జీర్ణాశయంలోకి ఆహారం నేరుగా వెళ్లడం వల్ల కడుపునొప్పి, కడుపుబ్బరం వంటి సమస్యలు పెరుగుతాయి. అలాగే శరీరంలో కొవ్వు కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఇకపై ఎప్పుడూ కూడా నిలబడి తినడానికి ప్రయత్నం చేయకండి.