తెల్లనువ్వులతో గ్రే హెయిర్ కి చెక్ పెట్టండిలా..!

Divya
ఈ మధ్యకాలంలో పొల్యూషన్ వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా జుట్టు కూడా అనారోగ్యానికి గురువ్వుతూ ఉంది.మరియు జుట్టు తెల్లబడటానికి
కారణం మన శరీరంలో సరిగ్గా మెలను ఉత్పత్తి కాకపోవడమే.ఈ సమస్యతో చాలామంది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు తెల్ల జుట్టు కవర్ చేసుకునేకి రకరకాల ప్రోడక్ట్స్ వాడుతూ అనేక ఇబ్బందులను కొని తెచ్చుకుంటూ ఉన్నారు.మరి అలాంటి జుట్టును తొందరగా నల్లబడేలా చేయడమే కాకుండా బారుగా అందంగా పెరిగేందుకు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి.ముఖ్యంగా తెల్ల నువ్వులను తీసుకోవడం వల్ల మెలనిన్ ఉత్పత్తి పెరిగి,జుట్టు నల్లగా మాడమే కాకుండా,జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.మరి ఆ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి..

దీనికోసం ముందుగా ఒక రెండు స్పూన్ల తెల్ల నువ్వులను ఒక గిన్నెలో తీసుకొని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి.ఆ తరువాత ఉదయాన్నే రాత్రి నానబెట్టుకున్న నువ్వులను మిక్సీ గిన్నెలో తీసుకొని అందులో ఒక స్పూను ఉసిరి పొడి మరియు ఒక స్పూన్ గుంటగలగరాకు రసం,రెండు టీ స్పూన్ల నిమ్మరసం  కలిపి బాగామిక్సీ పట్టుకోవాలి.ఇప్పుడు జుట్టుకు రాయబోయే ముందు జుట్టును బాగా శుభ్రం చేసుకోవాలి.

ఆ తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత తలకు క్యాప్ ను ధరించి,గంట నుంచి రెండు గంటలసేపు బాగా ఆరనివ్వాలి.ఇలా బాగా ఆరిన తర్వాత,మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకుంటే సరి.

ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏదైనా జుట్టుకు ప్యాక్ అప్లై చేసిన చేసి శుభ్రం చేసుకున్న తర్వాత కచ్చితంగా ఏదో ఒక మాయిశ్చరైజర్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి.లేకుంటే జుట్టు తేమను కోల్పోయి డీహైడ్రేట్ అయ్యి ఎండుగడ్డిలా మారుతుంది.కావున గ్రే హెయిర్ తో బాధపడేవారు వారానికి రెండు సార్లు ఈ చిట్కాను పాటించి,గ్రే హెయిర్ బారిన పడకుండా మీ జుట్టును కాపాడుకోండి.మరియు దీనితోపాటు మంచి పోషకాహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: