పిల్లల్లో నులిపురుగులను పారద్రోలాలంటే ఈ ఒక్క చిట్కా చాలు..!

Divya
ఈ మధ్యకాలంలో పిల్లల్లో చాలామందికి కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల,వారికి తొందరగా ఆకలి వేయకపోవడం,తిన్నది అరగకపోవడం,పొట్టనొప్పి రక్తహీనత,వాంతులు,విరోచనాలు వంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి.అటువంటి పిల్లలు వచ్చి ఏదైనా సమస్య అని చెప్పినా,పెద్దలు అంతగా పట్టించుకోరు కూడా.కానీ ఈ సమస్యని ఇలానే వదిలేస్తే పిల్లల ప్రాణాలు సైతం తీసే శక్తి నులిపురుగులకు ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనం తిన్న ఆహారం నుంచి పోషకాలను గ్రహించి,పెరిగే పరాన్న జీవులు.ఇటువంటి నులిపురుగుల నివారణ కోసం భారత ప్రభుత్వం కూడా ఎంతో ఖర్చు చేసి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోందంటే,ఆ సమస్య తీవ్రతను మనం కూడా అర్థం చేసుకోవచ్చు.కావున ఈ సమస్య ఈ పిల్లల్లో కూడా ఉంటే,ఈ అమ్మమ్మ కాలం నాటి చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మరి అవేంటో మనము తెలుసుకుందాం పదండి..
ముందుగా ఈ చిట్కా కోసం మూడు టేబుల్ స్పూన్ల వాము తీసుకుని బాగా వేయించుకోవాలి.అదే బాండిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించి మీక్సీ గిన్నెలో వేయాలి.ఇందులోనే వేయించిన వాము మరియు ఒక స్పూన్ బెల్లం,ఒక స్ఫూన్ నెయ్యి వేసి బాగా మెత్తని మిశ్రమం అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి.ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని గోళీ సైజంతా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే 15 రోజులపాటు నిల్వ ఉంటాయి.
ఎవరైతే నులిపురుగుల సమస్యతో బాధపడుతూ ఉన్నారో,అటువంటి పిల్లలకు ఈ ఉండలను రోజు పరగడుపున మరియు రాత్రి పడుకోబోయే ముందు పూటకు ఒకటి చొప్పున మింగించాలి.ఇలా 15 రోజుల పాటు మింగించడం నులిపురుగులు చనిపోయి, మలంతో పాటు బయటకు వస్తాయి.
అంతేకాక వాము తీసుకోవడం వల్ల కడుపునొప్పి,గ్యాస్, ఉబ్బరం,మలబద్ధకం,అజీర్తి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.ఇటువంటి సమస్య పెద్దలు ఎదుర్కొన్నా సరే ఈ చిట్కా వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లలకు రోజు ఈ ఉండలను ఇవ్వడం అలవాటు చేసి వారి సమస్యలను చిటికలో తొలగించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: