ఈ ఒక్క పొడితో గుండె సమస్యలు మాయం?

Purushottham Vinay
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అసలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ గుండె పోటుకు గురవుతున్నారు.చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ తో మరణిస్తూండటం అందర్నీ ఎంతగానో కలిచివేస్తుంది.ఎంత ఫిట్ గా ఉంటున్నా కూడా గుండె సమస్యలు రోజు రోజుకూ బాగా తీవ్రతరం అవుతున్నాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చిన్న ఏజ్ లోనే గుండె పోటుతో మరణిస్తున్నారు.హార్ట్ ఎటాక్ కి చాలా రకరకాల కారణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అతిగా తినడం, పొగ త్రాగడం, మద్యం సేవించడం, సరైన నిద్ర లేకపోవడం, రోజూ ఒకే చోట కూర్చొని ఉండం, ఆందోళనకు గురవ్వడం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాయామం చేయకపోవడం ఇంకా జంక్ ఫుడ్ తినడం ఇలా ఒక్కటేంటి.. గుండె పోటుకు చాలా రకాల కారణాలు ఉంటున్నాయి. గతంలో కేవలం 50 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఎక్కువగా హార్ట్ ఎటాక్ కు గురయ్యేవారు. కానీ ఇప్పుడు 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సువారికి కూడా గుండె పోటులు ఈజీగా వస్తున్నాయి. అది గుండె ఆరోగ్యంపై సరైన శ్రద్ధ చూపించకపోవడం వల్లనే.. ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



అయితే అర్జున చెట్టు బెరడును కనుక ప్రతి రోజూ తీసుకుంటే.. ఖచ్చితంగా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే జీవితంలో గుండెకు సంబంధించిన సమస్యలు చాలా వరకు రావని కూడా వైద్య నిపుణులు అంటున్నారు. ఈ అర్జున చెట్టు బెరడు.. ఆయుర్వేద షాపుల్లో ఎక్కువగా లభిస్తుంది. లేదా చెట్టు బెరడు అందుబాటులో ఉన్నా వాడుకోవచ్చు. ఇక ఈ అర్జున చెట్టు బెరడు లేదా పొడిని ఒక గ్లాస్ పాలలో వేసి బాగా మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని తాగితే హార్ట్ ఎటాక్ లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.ఇంకా అలాగే రాత్రంతా ఈ పొడి లేదా బెరడును నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం అయినా తాగవచ్చు. ఈ విధంగా అర్జున చెట్టు బెరడును తీసుకోవడం వల్ల గుండె సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా ఇది కేవలం గుండె సమస్యలే కాదు.. ఇతర అనారోగ్య సమస్యలను కూడా దరి చేరకుండా చేస్తుంది. అలాగే బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే అస్తమా, దగ్గు కూడా తగ్గుతాయి. ఇంకా చర్మ సమస్యలు కూడా రావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: