కాకరకాయల వల్ల ఉపయోగాలు తెలిస్తే వదలరు..!!

Divya
మనకి తక్కువ ధరలకే లభించే వాటిలలో కాకరకాయ కూడా ఒకటి.. ఇది ఎక్కడైనా ఎప్పుడైనా సరే మనకు దొరుకుతూ ఉంటుంది. తినడానికి ఇది చేదుగా ఉంటుంది కానీ శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తూ ఉంటుంది దీనివల్ల చాలామంది తినడానికి ఇష్టపడరు. అయితే ఇది ఒక సూపర్ ఫుడ్ అని కూడా చెప్పవచ్చు. కాకరకాయ వల్ల పలు రకాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. వాటి గురించి తెలుసుకుందాం. కాకరకాయని చాలా మార్గాలలో మనం తినవచ్చు. అయితే కాకరకాయ చేదుగా ఉంటుందని తట్టుకోలేని వారు ఇందులోకి కాస్త ఉప్పు లేదా బెల్లం వంటి వాటితో ఫ్రై చేసుకుని మనం తినవచ్చు.


కాకరకాయలలో పాలిఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి మన శరీరంలోని వాపులను సైతం తగ్గించేలా చేస్తాయి రెగ్యులర్ గా వీటిని తిన్నట్లు అయితే వాపు సమస్యలు అనేవి ఉండవట.


కాకరకాయ జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా చాలా సహాయపడుతుంది.. అంతేకాకుండా గ్యాస్ సమస్య మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు వీటిని తినడం మంచిది.


కాకరకాయలలో విటమిన్-C,A వంటివి పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు వీటిని తినడం మంచిది. అంతేకాకుండా కీళ్లనొప్పుతో బాధపడేవారు వీటిని తినవచ్చు.

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు కాకరకాయను తినడం వల్ల కొలెస్ట్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది.దీనివల్ల అధిక రక్తపోటు గుండెపోటు వచ్చే అవకాశం ఉండదట.


కాకరకాయ జ్యూస్ ని తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది దీనివల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయట.


కాకరకాయలు ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల జీర్ణ సమస్యలు దరిచేరనివ్వకుండా చేస్తుంది. అలాగే కిడ్నీలో రాళ్లను కూడా కరిగించేలా చేస్తాయట. అందుకే ప్రతి ఒక్కరూ కనీసం నెలలో రెండుసార్లు అయినా కాకరకాయను ఏదో విధంగా తినడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: