అల్జిమర్ రాబోతోందని మన శరీరం మనకు ఇచ్చే హింట్ ఎంటో తెలుసా..?
కొంచెం కొంచెం మర్చిపోవడం..
చాలామందికి ఏదైనా వస్తువును ఎక్కడ పెట్టామా లేదా, స్టవ్ ఆఫ్ చేసామా లేదా,ఇంటికి లాక్ వేసామా లేదా అనే డౌట్లు పదే పదే వస్తూ ఉన్నాయి అంటే,భవిష్యత్తులో అల్జీమర్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుందనీ,అలా రాకుండా ఉండాలి అంటే,జీవన శైలిలో మార్పులు కలగ చేసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.
నత్తి రావడం..
పుట్టుకతో మనకు నత్తి లేకపోయినా సరే,వయసు పైబడే కొద్దీ మాటలు తడబడటం నత్తి రావడం వంటివి జరుగుతూ ఉంటే,ఫ్యూచర్లో అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది.కావున ఎవరు మాట్లాడే తీరు వారే గమనించుకొని ఈ సమస్యను అదిగమించడం చాలా ముఖ్యం.
అధికంగా కోపం రావడం..
కొంతమందికి ఏ కారణము లేకుండా సరే ఊరికె కోపం రావడం జరుగుతూ ఉంటుంది.దీనికి కారణం మెదడు నరాల్లో ఏర్పడే అలజడి మరియు ఆందోళన ప్రముఖ పాత్ర వహించి చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చేందుకు దోహదపడతాయి.ఈ విషయం ఏమి కాదులేని వదిలేస్తే మాత్రం ఫ్యూచర్లో ఆల్జీమర్స్ తప్పదు.
చెప్పిన విషయమే పదేపదే చెప్పడం..
కొంతమంది చెప్పిన విషయాన్ని పదేపదే చెబుతూ పక్కన వారికి బోర్ కొట్టిస్తూ ఉంటారు.కానీ వారికి మాత్రం ఆ విషయం చెప్పినట్టు కూడా గుర్తు ఉండదు.వారికి కూడా భవిష్యత్తులో అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది.కావున ఈ విషయాలు మీ శరీరం మీకు ఏమైనా చెబుతోందా ఏమైనా అని,గమనించుకొని జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.