మధుమేహం అదుపులో ఉంచే పద్ధతులు ఇవే?

Purushottham Vinay
మధుమేహం అదుపులో ఉంచే పద్ధతులు ఇవే?


ప్రస్తుతం మధుమేహం సర్వసాధారణం అయిపోయింది. చిన్న వయసులోనే చాలామంది మధుమేహం సమస్యతో  బాధపడుతున్నారు. అయితే చాలా మధుమేహం ప్రమాదకరమైన వ్యాధి.  మధుమేహం కారణంగా చాలా తీవ్రమైన వ్యాధులకు గురికావాల్సి ఉంటుంది. ఒక్కసారి మధుమేహం బారిపడిన వారికి అది పూర్తిగా నయం కానప్పటికీ, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. మధుమేహం  అదుపులోనే ఉంటుంది. మళ్లీ దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మీరు డయాబెటిస్‌ను నియంత్రించలేరని అనుకుంటే అది తప్పు. ఎందుకంటే మీరు మీ జీవితంలో ఈ పద్ధతులు పాటిస్తే..మీరు ఖచ్చితంగా డయాబెటిస్‌ను ఈజీగా నియంత్రించవచ్చు.మధుమేహ బాధితులు ఖచ్చితంగా ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం మంచిది. కెఫిన్ ఉన్న ఆహారాన్ని అస్సలు తినవద్దు. ముఖ్యంగా పడుకునే ముందు వీటిని అస్సలు ముట్టుకోకండి. ఇది రక్తంలో చక్కెరను ఈజీగా పెంచుతుంది.  అరుదుగా తాగితే సమస్య ఉండదు.అలాగే మానసిక ఒత్తిడి వల్ల కూడా శరీరంలో షుగర్ పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ధ్యానం మానేయకండి. 



కాబట్టి రోజుకు ఒక 15 నిమిషాలు ధ్యానం చేయండి. ప్రాణాయామం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ధ్యానం మానసిక ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది.అలాగే రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మీ బరువును నియంత్రించడం చాలా అవసరం. వ్యాయామం, ఆహారం ద్వారా బరువును ఈజీగా అదుపులో ఉంచుకోవచ్చు.ఇంకా అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తారు. అందువల్ల వారి శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. దీనివల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు విపరీతమైన దాహంతో బాగా బాధపడుతుంటారు. దీన్ని నివారించడానికి ఖచ్చితంగా పుష్కలంగా నీళ్లు తాగాలి. అయితే శీతల పానీయాలు, చక్కెర పానీయాలకు చాలా దూరంగా ఉండండి.ఇక రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని వ్యాయామాలు ఖచ్చితంగా అవసరం.ప్రతి రోజూ అరగంట పాటు వ్యాయామం చేయాలి. వాకింగ్, సైక్లింగ్, జాగింగ్, యోగా ఇంకా జిమ్ మొదలైన వ్యాయామం రోజుకు అరగంట పాటు చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: