హిమోగ్లోబిన్ లెవెల్స్ ని పెంచే ఆహారాలు ఇవే?

Purushottham Vinay
హిమోగ్లోబిన్ అనేది మన శరీరం చుట్టూ ఉన్న ఆక్సిజన్ ను తీసుకెళ్లేందుకు సహాయపడుతుంది. ఇంకా అలాగే కార్బన్ డై ఆక్సైడ్ ను ఎర్ర రక్త కణాల నుంచి ఊపిరి తిత్తుల్లోకి తీసుకెళ్తుంది. ఇక అలా మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ లోపలికి.. కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వెళ్తుంది. హిమోగ్లోబిన్ అనేది తగిన మోతాదులో ఉంటే ఈ విధులన్నీ కూడా సక్రమంగా పని చేస్తాయి. లేదంటే ఖచ్చితంగా చాలా కష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో హిమోగ్లోబిన్ స్థాయిలను  ఎలా పెంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.



హిమోగ్లోబిన్ పరిమాణం కనుక తక్కువగా ఉంటే ఖచ్చితంగా రక్త హీనతకు దారి తీస్తుంది. ఎర్ర రక్త కణాలు  నశిస్తాయి. ఇవి కనుక నశిస్తే ఆహారంలో ఉండే పోషకాలను గ్రహించలేవు. దీంతో నీరసం, అలసట, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఖచ్చితంగా ఎదురవుతాయి. అయితే ఈ రక్త హీనత సమస్య అనేది ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. హిమోగ్లోబిన్ అనేది పెరగాలంటే ఖచ్చితంగా ఐరన్, విటమిన్ సి ఉన్నటువంటి ఆహార పదార్థాలని తినాలి.



గ్రీన్ వెజిటేబుల్స్, బ్రెడ్, నట్స్, మాంసం, చేపలు, సోయా ఉత్పత్తులు, గుడ్లు, ఖర్జూర పళ్లు ఇంకా ఆకు కూరలు వంటి వాటిల్లో ఐరన్ అధికంగా లభిస్తుంది. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. పైన చెప్పిన ఆహారం తినడం వల్ల హిమోగ్లోబినే కాకుండా.. ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తి బలపరుస్తుంది. ఇంకా అలాగే జీర్ణ క్రియలను మెరుగు పరుస్తుంది. అలాగే గుండె కూడా ఆరోగ్యంగా పని చేసేలా చూస్తాయి.ఇక ఐరన్ ను పూర్తిగా వినియోగించుకోవాలంటే మన శరీరానికి విటమిన్ సి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. విటమిన్ సి ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరం ఈజీగా ఐరన్ ను గ్రహిస్తుంది. టమోటాలు, స్ట్రాబెర్రీలు, బెల్ పెప్పర్స్, సిట్రస్ ఫ్రూట్స్ వంటి వాటిల్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది.కాబట్టి ఖచ్చితంగా ఇవి తీసుకోండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: