దోమల దాడి తట్టుకోలేకపోతున్నారా..అయితే ఇలా పారద్రోలండి..!!
దీనికోసం ముందుగా అయిపోయిన ఆల్ అవుట్ బాటిల్ ని తీసుకొని బాగా శుభ్రపరచుకొని తడి ఆరెంతవరకు ఎండబెట్టుకోవాలి.ఆ తర్వాత 10 నుంచి 15 లవంగాలు,పది మిరియాలు,ఐదారు కర్పూరం బిళ్ళలు తీసుకొని బాగా దంచుకోవాలి.వీటిని చిన్న గ్లాసులో నీటిలో కలిపి,అందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను కలుపు కోవాలి.ఇప్పుడు దీనిని ఒక మూతవున్న బాటిల్ లో వేసి,రోజంతా అలాగే వదిలేయాలి.ఇప్పుడు ముందుగా క్లిన్ చేసి అలౌట్ బాటిల్ ని తీసుకొని,అందులో ఆల్ అవుట్ పెట్టే మిషన్ కి పెట్టి,నార్మల్ ఆలౌట్ లాగా అన్ చేస్తే సరిపోతుంది.దాని నుంచి వచ్చే ఘాటైన పొగకు దోమలు తట్టుకోలేక పారిపోతాయి.
వీటితోపాటు ప్రతి రోజూ సాయంత్రం అవుతూనే దోమలు ఇంట్లోకి రాకుండా దోమతెరలను కర్టీన్ లను మూసివేయాలి.దోమల కుటుంబాలు ఇంప్రూవ్ కాకుండా కాలువలపై మూతలు వేయాలి.మరీ ముఖ్యంగా పిల్లలకు దోమలు కుట్టకుండా కాళ్లు,చేతులకు కొబ్బరి నూనె వంటివి రాయాలి.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నట్టయితే కచ్చితంగా ఈ న్యాచురల్ ఆల్ అవుట్ ని తయారు చేసుకుని,మీ ఫ్యామిలీని కెమికల్ బారి నుంచి కాపాడుకోండి.