మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో ఖచ్చితంగా ప్రోటీన్ కూడా ఒకటి. ప్రోటీన్ మన శరీరంలో చాలా రకాల విధులను నిర్వర్తిస్తుంది. శరీర పెరుగుదలకు, కండ పుష్టికి ఇంకా కణాల నిర్మాణంలో అలాగే పాడైన కణాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో ప్రోటీన్ ఎంతో అవసరమవుతుంది.ఇంకా అంతేకాకుండా జుట్టు పెరుగుదలకు, ఎముకుల, గోర్లు, చర్మం ఆరోగ్యంగా ఉండడంలో, అవయవాల పరిపూర్ణ ఆరోగ్యానికి ఇంకా హార్మోన్ల సమస్యలు తలెత్తకుండా చేయడంలో ఇలా మన శరీరంలో ఉన్న అయవాలన్నింటికి కూడా ప్రోటీన్ చాలా అవసరమవుతుంది. మనం తీసుకునే ఆహారంలో ప్రతి రోజూ 15 నుండి 33 శాతం ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. కానీ నేటి కాలంలో మారిన మన ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది కూడా ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు. ప్రోటీన్ లోపించడం వల్ల మనం చాలా అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.అందుకే శరీరంలో ప్రోటీన్ లోపించకుండా చూసుకోవాలి. ప్రోటీన్ లభించే ఆహారాలు అనగానే చాలా మంది చికెన్, మటన్, కోడిగుడ్లు మాత్రమే అని అనుకుంటారు. అయితే వీటిని అందరూ కూడా కొనుగోలు చేసి తినలేరు. కేవలం మాంసంలోనే కాకుండా మాంసం కంటే చాలా తక్కువ ధరలో లభించే పండ్లల్లో కూడా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల మనం మన శరీరంలో ప్రోటీన్ లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు. ఈ పండ్లు అందరికి అందుబాటు ధరలో ఉంటాయి. వీటిని అందరూ చాలా ఈజీగా తీసుకోవచ్చు.
ఇక ప్రోటీన్ ఉండే పండ్లల్లో జామపండ్లు కూడా ఒకటి. ఇవి మనకు చాలా తక్కువ ధరలో లభిస్తాయి.ఇంకా అలాగే చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు.ఒక కప్పు జామపండు ముక్కలల్లో 4.2 గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది. అందుకే ఈ జామపండ్లను తీసుకోవడం వల్ల కూడా ప్రోటీన్ లోపం రాకుండా చూసుకోవచ్చు.ఇంకా అలాగే సహజ సిద్దంగా తియ్యగా, మధుమరైన రుచిని కలిగి ఉండే పనస పండ్లల్లో కూడా ప్రోటీన్ అనేది ఉంటుంది. పనస తొనలల్లో చాలా రకాల పోషకాలతో పాటు ప్రోటీన్ కూడా ఉంటుంది. ఒక కప్పు పసన తొనలల్లో 2.8 గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది. అందుకే పనస పండ్లు లభించినప్పుడు వీటిని ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల ప్రోటీన్స్ తో పాటు ఇతర పోషకాలను కూడా పొందవచ్చు. ఇంకా అదే విధంగా మనకు అతి తక్కువ ధరలో లభించే అరటి పండ్లల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది.ఇంకా ఒక అరటిపండులో 1.3 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఈ అరటిపండ్లు చాలా తక్కువ ధరలో లభిస్తాయి. ఇంకా అలాగే రుచిగా కూడా ఉంటాయి. కాబట్టి వీటిని అందరూ ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయాలి.