పెరుగుతో ఎన్ని లాభాలో తెలుసా?

Purushottham Vinay
పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం చాలా పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పెరుగును తీసుకోవడం వల్ల ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. ఇంకా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇలా చాలా రకాలుగా పెరుగు మనకు సహాయపడుతుంది. కొన్నిసార్లు మాత్రం మన ఇంట్లో పెరుగు ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిన పెరుగును ఏం చేయాలో తెలియక కొంతమంది పాడేస్తూ ఉంటారు.మరికొందరు అయితే దానిని రోజుల తరబడి ఫ్రిజ్ లో అలాగే ఉంచుతారు. అయితే ఎక్కవుగా మిగిలిన పెరుగును పడేయకుండా కింద చెప్పిన విధంగా చేయడం వల్ల మనం మిగిలిన పెరుగును ఈజీగా వినియోగించుకోవచ్చు.ఎక్కువగా మిగిలిన పెరుగును మళ్ళీ ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మిగిలిన పెరుగుతో మనం స్మూతీలను కూడా తయారు చేసుకోవచ్చు. పెరుగులో ఐస్ క్యూబ్స్, తేనె ఇంకా చియా విత్తనాలు వేసి కలిపి స్మూతీలా కలిపి తీసుకోవచ్చు. ఇది రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇంకా అలాగే చికెన్, మటన్ వంటి వాటితో వెరైటీలను తయారు చేసినప్పుడు వాటిని పెరుగులో మ్యారినేట్ చేస్తూ ఉంటాము.



ఇక ఇలా మిగిలిన పెరుగుతో చక్కగా మ్యారినేట్ చేసుకుని వంటలు తయారు చేసుకోవచ్చు. చాలా మంది కూడా సలాడ్ వంటి వాటిని తింటూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. ఇక మిగిలిన పెరుగును సలాడ్ పై డ్రెస్సింగ్ గా కూడా ఉపయోగించవచ్చు. పెరుగులో నిమ్మరసం, హెర్బ్స్, ఆలివ్ నూనె ఇంకా వెల్లుల్లి తరుగు వేసి సలాడ్ పై డ్రెస్సింగ్ చేసుకుని తినవచ్చు.మిగిలిన పెరుగులో ఉప్పు, కారం, చాట్ మసాలా ఇంకా హెర్బ్స్ వంటి వాటిని కలిపి డిప్ గా కూడా వాడుకోవచ్చు. చిప్స్, ఫింగర్స్ ఇంకా కూరగాయల ముక్కలను ఇలా తయారు చేసిన పెరుగుతో కలిపి తీసుకోవచ్చు. ఇంట్లో పెరుగు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు దానితో రుచికరమైన లస్సీని కూడా తయారు చేసుకుని తాగవచ్చు. ఇంకా అలాగే చాలా రకాల మసాలా వంటకాల్లో కూడా ఎక్కువగా మిగిలిన పెరుగును ఉపయోగించుకోవచ్చు. ఇంకా అలాగే పెరుగులో ఉల్లిపాయ ముక్కలు, కీరదోస ముక్కలు, కొత్తిమీర, టమాట ముక్కలు వేసి బిర్యానీ ఇంకా పులావ్ వంటి వాటిలోకి రైతాగా తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: