ఈ రోజుల్లో చాలా మందికి కూడా క్యాల్షియం లోపం, విటమిన్ డి లోపం, మినరల్స్ కలిగిన పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడం వంటి వివిధ కారణాల వల్ల ఎముకలు ధృడత్వాన్ని కోల్పోతున్నాయి. మరీ ముఖ్యంగా ఆమ్లత్వం ఎక్కువగా ఉండే ఆహారాలను, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఎముకలు చాలా బలహీనంగా మారిపోతున్నాయి. పాత కాలంలో అయితే వయసుపైబడిన వారిలో మాత్రమే ఎముకలు ధృడంగా ఉండకపోయేవి. కానీ నేటి కాలంలో చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు తొందరగా విరిగిపోతున్నాయి. ఇంకా అంతేకాకుండా కీళ్ల నొప్పులు, ఆస్ట్రియో పోరోసిస్ వంటి సమస్యల బారిన కూడా పడుతున్నారు.అయితే ఇలాంటి సమస్యలు మన దరి చేరకుండా ఉండాలన్నా అలాగే ఎముకలు ధృడంగా మారాలన్నా పౌష్టికాహారంతో పాటు ఒక టీని కూడా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ టీని తాగడం వల్ల ఎముకలు చాలా ధృడంగా మారతాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. క్రిసాంతిమమ్ అనే పూలతో తయారు చేసిన టీని తాగడం వల్ల ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పూలు కూడా మనకు ఎండిన రూపంలో ఆన్ లైన్ లో లభిస్తూ ఉంటాయి. ఈ పూలను 5 నుండి 6 చొప్పున 200 ఎమ్ ఎల్ నీటిలో వేసి కాసేపు మరిగించాలి.
ఆ తరువాత వీటిని వడకట్టి ఇందులో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు చాలా ధృడంగా మారతాయి.ఇక ఈ పూలతో తయారు చేసిన టీ లో ప్రత్యేకంగా ఉండే క్యుబాంబరిన్ ఎ అనే రసాయన సమ్మేళనమే ఎముకలు గుల్లబారకుండా కాపాడడంలో సహాయపడుతుందని నిపుణులు తెలియజేసారు. చైనా శాస్త్రవేత్తలు జరిపిన ఈ పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఇంకా అలాగే గర్భాశయం తొలగించిన స్త్రీల్లలో, మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీల్లలో ఎముకలు ఎక్కువగా గుల్లబారిపోతూ ఉంటాయి. అలాంటి వారు ఈ టీని తాగడం వల్ల వారికి తగినంత క్యాల్షియం లభించి ఎముకలు చాలా ధృడంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. ఇంకా ఎముకల సాంద్రత కూడా పెరుగుతుంది. అలాగే ఈ టీని తాగడం వల్ల ఒత్తిడి, ఆత్రుత, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు, వయసు పైబడిన వారు క్రిసాంతిమమ్ పూలతో టీని తయారు చేసుకుని తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.