ఆర్టిఫిషియల్ ప్రోటీన్ షేక్ కన్నా..ఇంట్లో తయారుచేసుకునే ప్రోటీన్ లడ్డు మిన్న..!

Divya
ఈ మధ్యకాలంలో చాలామంది బరువు తగ్గాలని లేక ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆర్టిఫిషియల్ గా దొరికే ప్రొటీన్ షేక్స్ తీసుకొని తాగుతూ ఉంటున్నారు.ఇది మొదట్లో బాగానే ఉన్నా,దీని వల్ల వచ్చే ఆరోగ్య దుష్ప్రభావాలను మాత్రం చాలా భిన్నంగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు.దానికి బదులుగా మన ఇంట్లో దొరికే ప్రోటీన్ కలిగిన వస్తువులతో లడ్డూలు తయారు చేసుకుని రోజుకొకటి తినడం చాలా మేలని దాని వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెబుతున్నారు.మరి ఆ లడ్డులు ఎలా తయారు చేసుకోవాలో,ఏ వస్తువులు వాడాలో మనము తెలుసుకుందాం పదండి.

సాధారణంగా మన గోర్లు పెరగడానికి,జుట్టు పెరగడానికి కండరాలు బలంగా,దృఢంగా తయారవడానికి ప్రోటీన్ అనేది చాలా అవసరం.దీనికి కావాల్సిన ప్రోటీన్ మనం తీసుకునే ఆహారం నుంచి అందాల్సి ఉంటుంది.కానీ కొంతమంది సరైన ఆహారాలు తీసుకోకపోవడం వల్ల ప్రోటీన్ కొరత ఏర్పడుతుంది.

దీనిని అధిగమించడానికి ముందుగా ప్రోటీన్ అధికంగా ఉన్న గుమ్మడి గింజలు,అవిసె గింజలు,పల్లీలు,బాదాం, జీడిపప్పు,నువ్వులు 100 గ్రామస్ చొప్పున తీసుకొని  బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.అవి చల్లబడి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక్కొక్కటి ఒక్కొక్కసారి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.ఇలా పొడి చేసుకున్న ప్రతి పదార్థాన్ని కలిపి,సరిపడినంత బెల్లం వేసి బాగా దంచాలి.ఇలా దంచే క్రమంలో గింజల నుంచి వచ్చే నూనెతోనే అవి ముద్దగా తయారవుతాయి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని గాలి చొరబడని సీసాలో నిల్వ ఉంచుకుంటే నెలకు సరిపడా ఉంటాయి.

ఈ ప్రోటీన్ లడ్డుని మధుమేహులు తినేటట్టు అయితే సాధారణ బెల్లం బదులుగా,తాటి బెల్లం వాడుకోవడం మంచిది.తాటి బెల్లం వల్ల రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ సక్రమంగా ఉంటాయి.ఈ లడ్డును తీసుకోవడం వల్ల ప్రోటీన్ కొరత తగ్గడమే కాకుండా,అతిగా తినాలనే కోరిక కూడా అదుపులో ఉంటుంది.దానితో అధిక బరువు కంట్రోల్ లో ఉంటుంది.మీరు కూడా ప్రోటీన్ మిల్క్ షేక్ వాడుతున్నట్టు అయితే,దానికి బదులుగా ఈ లడ్డును తయారు చేసుకొని అధిక ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: