అవకాడో నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A, D, E ఇంకా ఫైటోస్టెరాల్స్ కూడా ఉన్నాయి.అలాగే మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, కె, ఫైబర్ మొదలైనవి కూడా ఉన్నాయి. అవకాడో ఆయిల్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చాలా ఎక్కువగా ఉండే అవకాడో నూనెను వంటలో చేర్చడం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అవోకాడో ఆయిల్‌లోని అధిక స్థాయి ఒలిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు ఇంకా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో మంటను తగ్గించడంలో చాలా సహాయపడతాయి. ఇంకా ఆర్థరైటిస్ వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.అవకాడో నూనెలో ఫైబర్ చాలా పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, ఇవి జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇంకా ఈ అవోకాడో నూనె ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం. ఇది విటమిన్లు A, D, E ఇంకా K శోషణలో సహాయపడుతుంది.
కాబట్టి అవోకాడో నూనెను పోషకాలు అధికంగా ఉండే ఆహారాలతో తీసుకోవడం వల్ల ఈ విటమిన్ల లభ్యత అనేది పెరుగుతుంది.అలాగే అవకాడో నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో చాలా బాగా సహాయపడతాయి. అలాగే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న అవకాడో ఆయిల్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి ఇంకా మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుంది.అవకాడో నూనెలో లుటిన్, జియాక్సంతిన్ అనే రెండు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇంకా కళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి. మోనోశాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండే ఆహారంలో అవకాడో నూనెను చేర్చడం వల్ల మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఇందులో ఒలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.