ఒంటరితనం.. రోజు 15 సిగరెట్లు తాగినంత ప్రమాదమట తెలుసా?
ఇలా నేటి జనరేషన్ లో మనిషి అందరూ ఉన్న ఒంటరి వాడిగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఒకవేళ కాస్తంత ఖాళీ సమయం దొరికింది అంటే చాలు అది మొబైల్ ఫోన్లోనే గడిపేస్తూ చివరికి అదే ప్రపంచం అనుకుంటున్నాడు. మరి కొంతమంది అయితే అందరూ పక్కనున్న లో
లోపల మాత్రం ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎప్పుడు ఖాళీగా ఉన్న ఇక అందరికీ దూరంగా కాస్త ఒంటరిగా ఏకాంతంగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇలా ఒంటరిగా ఉండడం మాత్రం చాలా ప్రమాదం అని చెబుతున్నారు నిపుణులు.
చుట్టూ ఎంత మంది ఉన్నా తనకంటూ ఎవరూ లేరు అనే భావన మనిషిని చాలా కుంగతీస్తుంది అంటూ చెబుతున్నారు. ఒంటరితనం అనేది రోజు 15 సిగరెట్లు తాగినంత ప్రమాదకరం అంటూ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం లో తేలింది. ఇక ఇలా ఒంటరితనాన్ని ఫీల్ అయ్యే వారిలో ఎక్కువగా గుండె జబ్బులు, డిప్రెషన్ లాంటి సమస్యలు వస్తాయట. అందుకే ఇలాంటి ఆలోచనతో ఉన్నవారు.. ఎక్కువగా ఈ ఒంటరి తనాన్ని దూరం చేసుకోవడానికి ప్రయాణాలు చేయాలని.. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలని.. అంతేకాకుండా ఇరుగుపొరుగు వారు స్నేహితులు, బంధువులతో కూడా మాటలు కలపాలి అంటూ సూచిస్తున్నారు నిపుణులు.