జున్నుతో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు?

Purushottham Vinay
మనకు పాల నుంచి తయారయ్యే రుచికరమైన పదార్థాల్లో జున్ను కూడా ఒకటి. జున్ను రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దీనిని అందరూ చాలా ఇష్టంగా తింటారు.ఆవు లేదా గేదె దూడలను జన్మించినప్పుడు వచ్చే పాలతో ఈ జున్నును తయారు చేస్తారు. బెల్లం లేదా పంచదార, యాలకుల పొడి ఇంకా మిరియాల పొడి వేసి ఈ జున్నును తయారు చేస్తూ ఉంటారు. జున్నును తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. జున్నులో కూడా దాదాపు పాలల్లో ఉండే పోషకాలు అన్ని ఉంటాయి. జున్నును తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సినంత క్యాల్షియం ఇంకా విటమిన్ డి లభిస్తుంది. అందువల్ల ఎముకలు, దంతాలు ధృడంగా, ఆరోగ్యంగా మారతాయి. ఇంకా కీళ్ల నొప్పులు  కూడా తగ్గుతాయి. జున్నును తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. అలాగే మలబద్దకం సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది.జున్నులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. జున్నును తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.



మన శరీరం బలంగా తయారవుతుంది. ఇంకా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.అలాగే ఇన్పెక్షన్స్ మన దరి చేరకుండా ఉంటాయి. మన శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో జున్ను బాగా సహాయపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం రోజంతా చాలా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. అలాగే నీరసం, బలహీనత వంటివి మన దరి చేరకుండా ఉంటాయి. జున్నును తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. అలాగే వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి.ఇంకా మన చర్మం పొడిబారకుండా అందంగా ఉంటుంది. ఈ విధంగా జున్ను మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే  ఈ మధ్యకాలంలో షాపుల్లో కూడా జున్ను పొడి లభిస్తుంది. కల్తీ చేసిన జున్ను పొడిని  మార్కెట్ లో అమ్ముతున్నారు. అయితే ఇలా కల్తీ జున్ను పొడితో జున్ను తయారు చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలగకపోగా మనం అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: