శీతాకాలంలో ఏ నీటితో స్నానం చేస్తే మేలు..!!
శీతాకాలంలో చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం లో వాతావ అనేది పెరుగుతుందట.. దీనివల్లనే కండరాల నొప్పులు, చర్మం పొడిబారడం వంటివి జరగడమే కాకుండా జీర్ణక్రియ సమస్యలు కూడా ఏర్పడతాయి. అయితే ప్రతిరోజు కూడా చల్లని నీటితో స్నానం చేసే వారైతే ఈ శీతాకాలంలో కూడా ఈ నీటితో స్నానం చేయవచ్చు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు.
ఒక వేళ శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేస్తే.. శరీర వాతాన్ని సైతం తగ్గిస్తుంది. అలాగే కండరాల నొప్పుల నుంచి కూడా విముక్తి అందిస్తుంది. శరీరానికి కూడా చాలా ప్రశాంతత లభిస్తుంది. వేడి నీటి నుండి వెలుపడే పొగ కూడా ఎన్నో సమస్యలను సైతం దూరం చేస్తుందట.
అయితే చాలామంది నిపుణులు తెలుపుతున్న ప్రకారం చెల్లని నీటిని స్నానం చేయడం వల్ల వాతాన్ని పెంచడమే కాకుండా చలి కూడా ఎక్కువ పెంచేలా చేస్తాయి.అందుకే శరీరాన్ని వేడిని కాపాడుకోవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. అందుచేతనే ఈ శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు సైతం తెలుపుతున్నారు. ముఖ్యంగా సీజనల్గా వచ్చే వ్యాధులను సైతం దూరం చేసుకోవచ్చని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.