ఈ పిండి తింటే ఈజీగా బరువు తగ్గుతారు?

Purushottham Vinay
ప్రతి రోజు కూడా ఉదయం పూట అల్పాహారంలో సత్తు పిండి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా పలు రకాల ప్రయోజనాలు చేకూరతాయి.ఇంకా అంతేకాదు శరీరంలో పేర్కొన్న టాక్సిన్స్ ని కూడా ఈ పిండి క్రమంగా తొలగించడంలో సహాయపడుతుంది. భారతదేశంలో పలు ప్రాంతాలలో ఈ పిండిని ప్రోటీన్ పౌడర్ కి ప్రత్యామ్నాయంగా వాడుతారు.అందుకే దీనిని పేదవారి ప్రోటీన్ పొడి అని అంటారు. వేలు వేలు ఖర్చు పెట్టి బయట దొరికే కెమికల్ ఫుడ్ తింటారు తప్ప మనకు లభించే సహజమైన ఫుడ్ ను తీసుకోవడం ఎవ్వరు ఇష్టపడరు.అందుకే ఇలాంటి సహజమైన మంచి ఆహారాలు క్రమంగా  కనుమరుగైపోతున్నాయి.ఈ పిండితో పలు రకాల రుచికరమైన వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పిండి మార్కెట్లో కూడా దొరుకుతుంది .కావాలి అనుకుంటే ఇంటి వద్ద కూడా దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు.


శనగలు, గోధుమలు ఇంకా రాగులు వంటి తృణధాన్యాలు కలిపి మెత్తటి పొడిగా చేసుకుని వస్త్ర కాయం పట్టుకోవాలి. దీంతో మీరు దోశల దగ్గర నుంచి లడ్డూల దాకా ఏమి కావాలన్నా శుభ్రంగా చేసుకొని తినవచ్చు. ఇంకా సత్తు పిండితో జావలాగా కాసుకొని తాగడం వల్ల శరీరంలోని అధిక వేడి ఈజీగా తగ్గుతుంది. పైగా ఇందులో ప్రోటీన్ ,ఫైబర్ ,కాల్షియం, ఐరన్ ,మాంగనీస్ ఇంకా మెగ్నీషియం లాంటి పోషక విలువలు కూడా పుష్కలంగా ఉంటాయి.ఇక బరువు తగ్గాలనుకునే వారు పొద్దున పరగడుపున ఈ పౌడర్ ని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఊబకాయం సమస్య క్రమంగా తగ్గుతుంది.ఇది శరీరంలోని జీవక్రియను మెరుగుపరచడంతో పాటు తీసుకున్న ఆహారం సులభంగా డైజెస్ట్ అయ్యేలా కూడా ఖచ్చితంగా సహాయపడుతుంది. అలాగే కడుపు నింపిన అనుభూతిని కలిగించి ఎక్కువ ఆహారం తీసుకొని కుండా అరికడుతుంది. అందుకే బరువు తగ్గాలి అనుకునే వారికి సత్తుపిండి చాలా మంచి ప్రత్యామ్నాయంగా పనికొస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: