మజ్జిగను ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..?

Divya
మజ్జిగ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని వైద్యులు ఎక్కువగా వీటిని తాగమని సూచిస్తూ ఉంటారు. ఇందులో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు సైతం చెక్ పెట్టే ఔషధంలా కూడా పనిచేస్తుంది.. జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి సమస్యలకైనా ఈ మజ్జిగతో చెక్ పెట్టవచ్చు. అయితే ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువగా మజ్జిగను తీసుకుంటే అది చాలా ప్రమాదమని నిపుణులు సైతం హెచ్చరిస్తూ ఉన్నారు. మజ్జిగను మోతాదుకు మించి తాగితే ఎలాంటి పరిణామాలు వస్తాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.



సాధారణంగా పాలతో తయారు చేసే పదార్థాలలో ఎక్కువగా లాక్టోస్ అనే ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది చాలామందికి జీర్ణం అవ్వదట.కొందరికి ఈ లాక్టోజ్ ను జీర్ణం చేసే ఎంజాయ్ చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుందట.. ఇలాంటి వారు ఈ  మజ్జిగను  తీసుకోకపోవడమే చాలా మంచిదని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు... ఇలాంటి వారికి కడుపునొప్పి, అజీర్తి విరేచనాలు, వంటివి కలిగి అవకాశం ఉంటుందట.ముఖ్యంగా చిన్నపిల్లలలో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని తెలియజేస్తున్నారు. చాలామందిలో ఎక్కువగా మజ్జిగను తీసుకోవడం వల్ల చర్మం పైన దద్దుర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుందట.


పాలలో ఉండే ప్రోటీన్లు పడకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుందట. కాబట్టి రోజుకి ఒక గ్లాసు నుంచి మజ్జిగను తీసుకోకూడదని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. మజ్జిగను ఎక్కువగా తీసుకుంటే జలుబు సమస్యలతో పాటు దగ్గు కూడా ఎక్కువగా వస్తుందట. ఇక కొంతమందిలో మజ్జిగలో అతిగా ఉప్పు వేసుకొని తాగడం వల్ల బీపీ కూడా పెరుగుతూ ఉంటుంది అయితే ఇలా నిత్యం తాగుతూ ఉండడం వల్ల శరీరంలో ఉప్పు ఎక్కువగా పేరుకు పోతుంది. దీనివల్ల హై బీపీ సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఎండాకాలంలో అయితే రెండు గ్లాసులు మజ్జిగ తాగిన ఎండ తాపం నుంచి బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: