ఈ అలవాట్లను మానేస్తే మీ మెదడు సేఫ్?

Purushottham Vinay
ఈ అలవాట్లను మానేస్తే మీ మెదడు సేఫ్?

మన శరీరంలో ఎంతో కీలకమైన మెదడును ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు పనితీరు మందగిస్తుంది. అలాంటి మెదడును మనం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చెడు అలవాట్లు మన మెదడను బలహీనపరుస్తాయి. ఆ చెడు అలవాట్ల  మీకు ఉంటే సాధ్యమైనంత త్వరగా బయటపడండి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందికి కూడా కంటినిండా నిద్ర సరిగా ఉండడం లేదు. మంచి నిద్ర మన శరీరానికి ఖచ్చితంగా చాలా అవసరం. ఎందుకంటే నిద్రలేమి కారణంగా మనస్సుపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే కంటినిండా నిద్రపోతే మెదడుపై ఒత్తిడి తగ్గుతుంది.అలాగే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్‌స్టంట్‌గా తినే ఆహారం నాలుకకు మంచి రుచిని అందించినా కానీ శరీరానికి మాత్రం హాని కలుగుతుంది. మీరు తినే ఆహారంలో ఎక్కువ కారం లేకుండా చూసుకోండి. 


చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు.అలాగే సిగరెట్లు, ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లు మెదడుపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. నిత్యం ధూమపానం లేదా ఆల్కహాల్ సేవించే వారి మెదడులో ఖచ్చితంగా సమస్యలు ఏర్పడతాయి. ఇంకా వారి జ్ఞాపకశక్తి కూడా బలహీనపడుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ అలవాట్లకు దూరంగా ఉండండి.అలాగే ఆఫీస్‌లలో కూర్చొని ఉద్యోగాలు చేసేవారు ఎక్కువ సమయం ఒకేచోట కదలకుండా ఉంటారు. ఇది శరీరానికి ఖచ్చితంగా హాని కలిగిస్తుంది.ఎందుకంటే ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల శరీరంలో రక్తపోటు తగ్గి మెదడు దెబ్బతింటుంది. ఇంకా అధిక బరువు కూడా పెరుగుతారు.అలాగే ఫోన్‌ను అధికంగా ఉపయోగించడం కూడా ఒత్తిడికి కారణమవుతుంది. ఫోన్ స్క్రీన్‌ను ఎక్కువ చూడడం ఖచ్చితంగా మెదడుపై ప్రభావం చూపిస్తుంది. మెదడు పనితీరులో అసమతుల్యత, నిద్రలేమి ఇంకా మనస్సు అస్థిరత వంటి అనేక సమస్యలు వస్తాయి.ఈ అలవాట్లను మానేస్తే మీ మెదడు సేఫ్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: