బిర్యానీ ఆకుతో ఇల్లంతా పొగ వేస్తే ఏమవుతుందో తెలుసా..!

Divya
చాలామంది ఇళ్లల్లో వాస్తు పరమైన దోషాలు కలిగి ఉండడం వల్ల,వారు రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇలాంటి సమస్యలతో బాధపడుతూ,వారి ఇంటి దోషాలను పోగొట్టుకోవాలని ఉన్నా కూడా నివారణ చర్యలకు చాలా మొత్తంగా ఖర్చని వెనకాడుతూ ఉంటారు.కానీ వాస్తు పరమైన దోషాలకు బిర్యానీ ఆకు చాలా బాగా ఉపయోగపడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ప్రతి మంగళవారం కానీ,శుక్రవారం కానీ, శనివారం కానీ బిర్యానీ కాల్చి ఇల్లంతా పొగను చూపడం వల్ల ఇంటిలో ఉన్న నెగటివ్ అంతా వెళ్ళిపోయి,చాలా సమస్యలు వరకు తీరుతాయని సూచిస్తూ ఉన్నారు. అసలు బిర్యానీ ఆకుతో ఎలాంటి సమస్యలను తీర్చుకోవచ్చు మనము తెలుసుకుందాం పదండి..
దాంపత్య సమస్యలు..
దాంపత్య జీవితంలో భార్యాభర్త అన్ని విధాలుగా అర్థం చేసుకుని సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు.కానీ ఇంట్లో ఉన్న కొన్ని రకాల ప్రతికూల శక్తులు వారి మధ్య గొడవలు చికాకులు వచ్చేలా చేస్తూఉంటాయి.ఇటువంటి నెగటివ్ ఎనర్జీలు పోగొట్టుకోవాలంటే ప్రతి మంగళవారం మూడు బిర్యానీ ఆకులు తీసుకుని అందులో ఐదు కానీ ఏడు కానీ లవంగాలు ఉంచి ఇంటి చుట్టూ పొగ వేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.దీనితో భార్య భర్త మధ్య సక్యత కూడా ఏర్పడుతుంది.
సమయానికి డబ్బు లేని వారు..
కొంతమందికి ఎన్ని డబ్బులు వచ్చినా సరే ఏదైనా అవసరమున్నప్పుడు కచ్చితంగా చేతిలో రూపాయి కూడా మిగలకుండా పోతూ ఉంటుంది.అలాంటివారు ప్రతి శుక్రవారం ఐదు బిర్యానీ ఆకులు తీసుకుని, అందులో కర్పూరం చిటికెడు ఆవాలు వేసి,ఇల్లంత పొగ వేయడం వల్ల డబ్బు చికాకులు తొలగుతాయి.మరియు అనుకున్న సమయానికి సరైన మొత్తంలో  ఏదో విధంగా డబ్బు అందుతుంది.
వ్యాపార సమస్యలు కలవారు..
వ్యాపారంలో లాభనష్టాలు సహజమే కానీ,కొంతమంది మాత్రం నష్టాలనే ఎక్కువగా చవిచూస్తూ ఉంటారు అలాంటి వారికి బిర్యానీ ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇందులో నుంచి వచ్చే మంచి ఆరోమా నెగటివ్ ఎనర్జీని పోగొట్టి, మనుషుల మెదడులో సరైన ఆలోచన కలిగేలా చేస్తుంది.దీనితో వ్యాపారవేత్తలు వ్యాపారంలో మెలకువలు పాటించి వ్యాపారాన్ని వృద్ధిలోకి తెస్తారు.ఈ బిర్యానీ ఆకుని కాల్చడం మాత్రం ప్రతి మంగళవారం రాత్రి సమయంలో చేయడం ఉత్తమం.
మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే వెంటనే బిరియాని ఆకుతో ఈ నివారణను పాటించి మీ సమస్యలకు ఉపశమనం కలిగించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: