వంటల్లో వాడే ఈ పదార్ధం ఆరోగ్యానికి చాలా మంచిది?

Purushottham Vinay
మనం జీలకర్రను ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉంటాం. వీటిని ఆహారాల్లో భాగంగా తీసుకుంటూ ఉంటాం. అయితే నల్ల జీల కర్రను మాత్రం మనం పెద్దగా వాడం. దీన్ని కలోంజీ అనే పేరుతో కూడా పిలుస్తారు.ఇది మనకు అన్ని షాపుల్లో కూడా  తేలికగా దొరుకుతుంది. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇక అవన్నీ తెలిస్తే మీరూ తప్పకుండా దీన్ని వాడే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మనం పరగడుపున అర టీ స్పూను కలోంజీ తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మనలో చాలా మందికి కూడా వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వారు తప్పకుండా కలోంజీ తినాలని మన ఆయుర్వేదం చెబుతోంది.అలాగే దీన్ని గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల ఆస్తమా, జలుబు, దగ్గు లాంటివి కూడా తగ్గుమఖం పడతాయి.ఇంకా అలాగే మలబద్ధకం ఉన్న వారు దీన్ని తరచుగా ఆహారంలో భాగంగా చేసుకుని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది.అలాగే దీన్ని తినడం వల్ల మొటిమల సమస్యలు ఈజీగా తగ్గుతాయి.పైగా దీనిలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొవ్వుల్ని పెంచే గుణాలు చాలా ఉన్నాయి. అందువల్ల ఊబకాయం, రక్త పోటు లాంటి సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. ఇంకా అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది.


ఇక కొందరికి అయితే చుండ్రు బాధ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు దీన్ని నానబెట్టి ముద్దలా చేసి కుదుళ్లకు బాగా పట్టించాలి.అందువల్ల చుండ్రు బాధ తగ్గడంతో పాటుగా జుట్టు కుదుళ్లు కూడా బాగా దృఢంగా మారతాయి.మన రక్తంలో చక్కెరలు అనియంత్రితంగా ఉండటం వల్ల చాలా మందికి మధుమేహం ఇబ్బంది పెడుతూ ఉంటుంది.అయితే ఇలాంటి వారు బ్లాక్‌ టీతో పాటు నల్ల జీలకర్రను పరగడుపున తీసుకోవడం వల్ల మధుమేహం ఈజీగా అదుపులో ఉంటుంది.అలాగే చాలా మందికి రకరకాల పళ్ల సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా చిగుళ్ల నుంచి రక్తం కారడం, పళ్ల నొప్పి లాంటివి ఉంటాయి. అయితే ఇలాంటి వారు కలోంజీ నూనెను అర టీ స్పూను మోతాదుగా తీసుకోవాలి. అయితే దీన్ని కొద్దిగా పెరుగులో కలిపి రోజుకు రెండు సార్లు చొప్పున రాసుకుంటూ ఉండాలి.అలా చేస్తే పంటి సమస్యలన్నీ ఈజీగా తగ్గుతాయి.ఇంకా ఆస్తమా ఉన్న వారికి ఊపిరి ఆడక వారికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అయితే గోరు వెచ్చటి నీటిలో కలోంజీ నూనె, తేనెల్ని వేసి బాగా కలపాలి.ప్రతి రోజూ పరగడుపున దాన్ని తాగడం వల్ల ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: