పురుషుల్లో లైంగిక శక్తిని పెంచే సూపర్ ఫుడ్ ఇదే?

Purushottham Vinay
నేటి కాలంలో చాలా మంది పురుషుల్లో కూడా వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, ధూమపానం ఇంకా మద్యపానం వంటి చాలా రకాల కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.దీంతో చాలా మంది పురుషుల్లో సంతానలేమి సమస్య ఎక్కువగా తలెత్తుతుంది.అందువల్ల వైవాహిక జీవితం విచ్చినం అవుతుందని చెప్పవచ్చు. ఈ సమస్యతో బాధపడే వారు రోజు రోజుకు చాలా ఎక్కువవుతున్నారు.ఇంకా అలాగే ఈ సమస్య కారణంగా ఆత్మనూన్యత భావనకు కూడా గురి అవుతూ ఉంటారు.అందువల్ల ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా రకాల మందులను, సప్లిమెంట్స్ ను వాడుతున్నారు. అయితే ఇలా మందులకు బదులుగా సహజ సిద్దంగా లభించే ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎండుద్రాక్ష గురించి మనందరికి తెలిసిందే. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి.పైగా మనకు వివిధ రంగుల్లో ఇవి లభిస్తూ ఉంటాయి. ఎండుద్రాక్షలో ప్రోటీన్స్, ఐరన్, ఫైబర్, కాపర్, పొటాషియం ఇంకా క్యాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.



 అందుకే వీటిని తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల వీర్య కణాల నాణ్యతతో పాటు లైంగిక సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయని వారు చెబుతున్నారు. పురుషులు ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరగడంతో పాటు శరీరం కూడా చాలా బలంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యతో బాధపడే పురుషులు ఈ ఎండుద్రాక్షను ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లైంగిక సమస్యలతో బాదపడే పురుషులు ప్రతి రోజూ 10 నుండి 12 ఎండుద్రాక్షలను తీసుకొని వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి.అయితే ఉదయం వీలుకాని వారు ఈ ఎండుద్రాక్షలను పాలల్లో ఉడికించి రాత్రినిద్ర పోవడానికి ఒక గంట ముందు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాలతో పాటు వాటి నాణ్యత కూడా పెరుగుతుందని ఇంకా అలాగే సామర్థ్యం కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: