చాలా మందికి కూడా చాలా కారణాల వల్ల దంతాల మీద పసుపు మరకలు ఉంటాయి.రోజువారీ ఆహార కణాలు దంతాల మీద ఎక్కువగా పేరుకుపోతాయి. ఇది పసుపు దంతాలకు ప్రధాన కారణం అవుతుంది.ఇక పొగాకు వాడకం,అధిక కాఫీ, టీ వినియోగం,ధూమపానం, నోటి ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడం, పంటి ఎనామిల్‌ను ప్రభావితం చేసే వ్యాధులు మన దంతాలు పసుపు రంగులోకి మారడానికి దారితీసే కారకాలు. పసుపు పళ్లను తెల్లగా మార్చుకోవడానికి మీరు దంతవైద్యుని వద్దకు వెళ్లవచ్చు, అయితే పసుపు పళ్లను ముత్యాల్లా మెరిసేలా చేసే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి.అవేంటో తెలుసుకుందాం.ముందుగా మీరు ఒక చెంచా ఉప్పు తీసుకుని అందులో నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమంతో పళ్లను తోముకోవడం వల్ల దంతాల మీద ఉన్న పసుపు మరక చాలా సులభంగా తొలగిపోతుంది.అలాగే రెండు చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపండి. తర్వాత ఈ నీటితో బాగా పుక్కిలించాలి.
ఈ హోం రెమెడీని వారానికి ఒకటి లేదా రెండు సార్లు ట్రై చెయ్యొచ్చు.2 టేబుల్ స్పూన్లువంట సోడాదాన్ని తీసుకుని నీళ్లలో కలిపి చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్‌ను మీ దంతాల మీద అప్లై చేసి 5 నిమిషాల పాటు అలాగే ఉంచండి. అప్పుడు మీ నోరు శుభ్రం చేయు. రోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే పళ్లపై ఉన్న ఈ మరకలు చాలా ఈజీగా పోతాయి.అలాగే తులసి ఆకులను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఎండిన నారింజ తొక్కను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. అప్పుడు ఈ రెండు పదార్థాలను కలపండి. ఈ పేస్ట్‌ను నేరుగా మీ దంతాల మీద అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. అప్పుడు మీ నోటిని సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. దంతాల కోసం ఈ హోం రెమెడీ ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించదు. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. పళ్లపై ఉండే పసుపు మరకలు, గార చాలా ఈజీగా తగ్గిపోతాయి. అందమైన తెల్లటి దంతాలు మీ సొంతం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ ట్రై చెయ్యండి.