నల్ల ద్రాక్ష గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే.ఎందుకంటే ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.అందుకే దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.నల్ల ద్రాక్ష తినడం వల్ల మధు మేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బ్లాక్ గ్రేప్స్ లో రెస్వెరాటల్ అనే పదార్థం ఉంటుంది. ఇది బ్లడ్ లో ఇన్సులిన్ స్థాయిలను పెంచి.. షుగర్ లెవల్స్ ను అదుపులోకి తీసుకొస్తుంది.దీన్ని తినడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని మెరుగు పరుస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే మతి మరుపు, అల్జీ మర్స్, ఆందోళన వంటి సమస్యలను అదుపు చేస్తుంది. మైగ్రేన్ తో బాధ పడేవారు కూడా నల్ల ద్రాక్షను తీసుకుంటే కంట్రోల్ అవుతుంది.ఇంకా అలాగే జుట్టు సమస్యలను తగ్గించు కోవచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఈ.. జుట్టుకు చాలా మేలు చేస్తుంది. చుండ్రు, జుట్టు రాలడం, తెల్లగా మారడం వంటి సమస్యలను కంట్రోల్ చేస్తుంది.
తరుచుగా తినడం వల్ల జుట్టు మందంగా, బలంగా, సాఫ్ట్ గా మారుతుంది.ఊబకాయంతో బాధ పడేవారు నల్ల ద్రాక్షను తీసుకుంటే.. ఉపశమనం లభిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ఏర్పడటం ఆపడం ద్వారా ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది.నల్ల ద్రాక్షలో ఫ్లేవనాయిడ్స్ లాంటి శక్తి వంతమైన యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను తొలగిస్తాయి. తరచూగా తీసుకుంటే నిత్యం యంగ్ గా ఉంటారు. అంతే కాకుండా చర్మం కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. స్కిన్ పై మచ్చలు, ముడతలు వంటివి రాకుండా నియంత్రిస్తుంది.వీటిలో విటమిన్లు ఎ, సి, బి6, ఫోలిక్ యాసిడ్స్, సిట్రస్ యాసిడ్స్, గ్లూకోజ్, మెగ్నీషియం, జింక్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. పుల్లగా ఉంటాయని చాలా మంది వీటిని దూరంగా పెడతారు. కానీ వీటిని నేరుగా తిన్నా, జ్యూస్ రూపంలో తాగినా డయాబెటీస్, రక్త పోటు, గుండె జబ్బులు, స్కిన్, హెయిర్ కి సంబంధించిన సమస్యలను తగ్గించవచ్చు.