మహిళలు తమ శరీర బరువును అదుపులో ఉంచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఫైబర్ ఎంతో అవసరం. కనుక స్త్రీలు ఫైబర్ ఉండే ఆహారాలను కూడా తప్పకుండా తీసుకోవాలి. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, గాయాలు త్వరగా నయం అయ్యేలా చేయడంలో జింక్ మనకు ఎంతో సహాయపడుతుంది. కనుక జింక్ ఉండే ఆహారాలైనటువంటి పాలు, గింజలు, తృణ ధాన్యాలు వంటి వాటిని రోజూవారి ఆహారంలో భాగంగా తీసుకోవాలి.మహిళలు మెగ్నీషియం ఉండే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. కండరాలు ఇంకా నరాల పనితీరుకు ఇది ఎంతో అవసరం. ఆకుకూరలు, గింజలు, తృణ ధాన్యాలు, చిక్కుళ్లు వంటిని రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఇక చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి గానూ విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకోవాలి. నిమ్మజాతికి చెందిన పండ్లను, బెల్ పెప్పర్స్, బ్రోకలి వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ సి అందుతుంది. అదే విధంగా రోజూ ప్రోటీన్ ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి. కండరాల నిర్వహణలో, హార్మోన్ల ఉత్పత్తికి, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇలా అనేక రకాలుగా ప్రోటీన్ మనకు అవసరమవుతుంది.
అలాగే విటమిన్ బి9 ఉండే ఆహారాలను తీసుకోవాలి. స్త్రీలల్లో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, గర్భధారణ సమయంలో, పిండం అభివృద్దికి ఫోలేట్ ఎంతో అవసరం. ఆకుకూరలు, నిమ్మజాతికి చెందిన పండ్లు, తృణ ధాన్యాలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ఫోలేట్ అందుతుంది. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అవిసె గింజలు, చియా విత్తనాలు, వాల్ నట్స్, సాల్మన్ చేపలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. ఇక ఎముకలను ధృడంగా ఉంచడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ డి ఎంతో అవసరమవుతుంది. రోజూ ఎండలోకూర్చోవడం, పాలు మరియు పాల ఉత్పత్తులు, చేపలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల తగినంత విటమిన్ డి అందుతుంది.కాబట్టి మహిళలు ఈ ఆహారాలు తీసుకోండి. ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.