అధిక యూరిక్ యాసిడ్ ని తమలపాకుతో తరిమికొట్టేయండి..!
ఇలా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కీళ్లనొప్పులు రావడమే కాకుండా,స్పటికాలుగా మారి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.దీనితో అనేక ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే యూరిక్ యాసిడ్ శరీరంలో ఎక్కువ కాలం పేరుకుపోయి,ఘనపదార్థాలుగా గట్టిగా ఏర్పడి,కిడ్నీలో రాళ్లు తయారవుతాయి.దీనికి ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా,అప్పటికప్పుడు ప్రయోజనం కలుగుతుందే తప్ప పర్మినెంట్ గా సొల్యూషన్ దొరకదు.అందుకే యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడానికి కొన్ని ఇంటి నివారణలే పర్మనెంట్ గా సొల్యూషన్ చూపిస్తాయని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.అందులో ముఖ్యంగా తమలపాకులు యూరిక్ యాసిడ్‌కు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి.ఈ ఆకులను ఎలా ఉపయోగించాలో,మరియు వాటి ప్రయోజనాలను తెలుసుకుందామా..
అధిక యూరిక్ యాసిడ్ తో బాధపడేవారు రోజు ఒక తమలపాకు తీసుకొని బాగా శుభ్రం చేసి,అందులో అర స్పూన్ తేనె,అర స్పూన్ సోంపు,ఒక యాలుక వేసి కిల్లి లాగా చుట్టి నమలాలి.ఇలా రోజు 45 రోజులు పాటు చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అధిక యూరిక్ యాసిడ్ మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది.ఈ తమలపాకు నమిలే సమయంలో పొగాకును కానీ, సున్నం కానీ,అసలు ఉపయోగించకూడదు.వాటి వల్ల అధిక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
దీనిని రోజు తినడం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తొలగడమే కాకుండా తమలపాకులు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.ఇది చాలా పరిశోధనల్లో కూడా రుజువైంది. తమలపాకులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల అసౌకర్యం మరియు నొప్పికి లోపల నుంచి నివారణ కలిగిస్తాయి.అంతేకాక రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు బోలు ఎముకల వ్యాధి వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఉపశమనం కలుగుతుంది.