పిప్పి పన్ను సమస్య ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సమస్య వచ్చిందంటే అంత ఈజీగా తగ్గదు. ఈ సమస్య మహా నరకం అని చెప్పాలి. దీని వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. ఒక్కసారి దంతం పుచ్చుపోతే అది మళ్లీ సాధారణ స్థితికి రాదు. కేవలం దాని నుంచి వచ్చే నొప్పి, ఇన్ ఫెక్షన్ మాత్రమే మనం తగ్గించుకోగలం. సాధారణంగా పిప్పి పన్ను రాగానే పెయిన్ కిల్లర్స్, యాంటీ బయోటిక్స్‌ని వాడుతూ ఉంటారు.అయితే అలా కాకుండా తేనెతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.పిప్పి పన్ను సమస్య మీర వేధిస్తూ ఉంటే తేనె కలిపిన నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. రోజులో ఓ నాలుగు సార్లు, తేనె, నిమ్మ రసం కలిపిన వాటర్ తీసుకోవడం వల్ల నొప్పి అదుపులోకి వస్తుంది. ఇలా రెండు రోజులు చేయడం వల్ల నొప్పి, బాధ, వాపు, ఇన్ ఫెక్షన్ అనేవి కంట్రోల్ అవుతాయి.
అదే విధంగా దంతాలపై తేనె రాస్తూ ఉపవాసం ఉంటే.. పిప్పి పన్ను నొప్పితో పాటు ఇన్ ఫెక్షన్ కూడా త్వరగా తగ్గుతుంది. ఏమీ తినకుండా ఉండటం వల్ల బ్యాక్టీరియా అనేది ఏర్పడకుండా ఉంటుంది.ఇంకా అంతే కాకుండా బ్రష్‌తో తేనె తీసుకుని దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే నోటిలో ఉండే ఇన్ ఫెక్షన్ త్వరగా తగ్గి.. నోటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పిప్పి పన్నులో ఉండే ఇన్ ఫెక్షన్‌ను తగ్గించడంలో సహాయ పడతాయి. ఈ సమస్యతో ఉన్న వారు రోజులో నాలుగు నుంచి 5 సార్లు తేనె రాయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. అతి తక్కువ సమయంలోనే నొప్పి అనేది కంట్రోల్‌లోకి వస్తుంది.పిప్పి పన్ను నొప్పితో బాధ పడుతున్నప్పుడు పిప్పి పన్నుపై తేనెను రాయాలి. కాబట్టి ఖచ్చితంగా ఇలా చెయ్యండి. పిప్పి పన్ను సమస్యని చాలా ఈజీగా తగ్గించుకోండి.