ఒత్తిడి వల్ల మనం కేవలం మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా చాలా సమస్యలు ఎదురుకుంటాం.విపరీతమైన ఒత్తిడి ప్రస్తుతం ఒక పెద్ద అనారోగ్య సమస్యగా మారిపోయింది. అందువల్ల చాలా మంది వైద్యులను సంప్రదిస్తూ ఉంటాం. సాధారణంగా వైద్యులు ఒత్తిడికి తగ్గించేందుకు మందులను సూచిస్తున్నారు. అయితే కొన్ని రకాల పండ్లను మనం తినడం వల్ల ఒత్తిడిని చాలా ఈజీగా దూరం చేసుకోవచ్చు.ఒత్తిడిని దూరం చేసే ఆ పండ్ల గురించి ఇంకా వాటివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..పియర్ పండు ఒత్తిడిని చాలా ఈజీగా తగ్గిస్తుంది. పియర్‌లో విటమిన్ బి, విటమిన్ ఈ శరీరానికి మేలు చేస్తాయి. ఒత్తిడి, టెన్షన్‌ను తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి. బి విటమిన్లు సెరోటోనిన్ అనే కొన్ని రసాయనాలను తయారు చేస్తాయి. సెరోటోనిన్ అనేది మెదడులో కనిపించే రసాయనం. ఇది మన మానసిక స్థితిని చక్కగా ఉంచుతుంది.ఒత్తిడిని నుంచి ఉపశమనం కల్పించడంలో దానిమ్మ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు దానిమ్మలో పుష్కలంగా ఉంటాయి.
విటమిన్ సి మన శరీరంలోని కణాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.ఒత్తిడికి యాపిల్ కూడా మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్ ఒత్తిడిని దూరం చేయడంలో ఉపయోగపడతాయి. రోజూ ఒక యాపిల్ తింటే ఒత్తిడి తగ్గుతుంది. యాపిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు మన కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. ఇది శరీర ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.ఒత్తిడిని ఈజీగా తగ్గించడంలో అరటి కీలక పాత్ర పోషిస్తుంది. అరటి పండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ6 వంటి పోషకాలు ఒత్తిడిని కలిగించే హార్మోన్లను తగ్గిస్తాయి. పొటాషియం అనేది శరీర కణాల ఆరోగ్యకరమైన పనితీరును నిర్వహించడానికి సహాయపడే ఒక ఖనిజం. ఇది ఒత్తిడి హార్మోన్లను నియంత్రించడం ద్వారా ఒత్తిడిని తగ్గిస్తుంది. మెగ్నీషియం ఒత్తిడి, నిరాశతో పోరాడటానికి ఉపయోగపడుతుంది. మెగ్నీషియం మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. విటమిన్ B6 సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.